Telugu Global
Andhra Pradesh

ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే నేత చంద్రబాబు

ముఖ్యమంత్రి జగన్ సిద్ధం.. అని అనగానే.. తాము కూడా సిద్ధం అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అంటున్నారని అన్నారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత తట్టా బుట్టా సర్దుకుని హైదరాబాద్ కు వెళ్లడానికి ఆ ముగ్గురు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు.

ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే నేత చంద్రబాబు
X

తనను ఆంబోతు రాంబాబు.. అని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంపై మంత్రి అంబటి రాంబాబు ఘాటు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే రాజకీయ నాయకుడు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబును ఆంబోతుల రాంబాబు అంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలపై తాజాగా మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుపట్టారు.

చంద్రబాబు తనను ఆంబోతుల రాంబాబు అంటున్నారని.. అధికారంలోకి వస్తే తనకు ముక్కుతాడు వేస్తానని అంటున్నారని.. అయితే ఆయన అధికారంలోకి వచ్చేది లేదు.. చచ్చేది లేదని మండిపడ్డారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే చరిత్ర చంద్రబాబుకు ఉందని దుయ్యబట్టారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే రాజకీయ నాయకుడు.. అని చంద్రబాబు చేతిపై పచ్చబొట్టు వేయిస్తానని అన్నారు.

చంద్రబాబు అమ‌లుకు సాధ్యం కాని హామీలన్నీ ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అంబటి విమర్శించారు. ఒకవేళ ఆయన గెలిస్తే మేనిఫెస్టో కూడా కనిపించకుండా మాయం చేయడం చంద్రబాబు విజన్ అని అన్నారు. చంద్రబాబుకు నిలువెల్లా విషమే అని.. చంద్రబాబును చూస్తే నల్ల విషనాగు కూడా చచ్చిపోతుందన్నారు.

ముఖ్యమంత్రి జగన్ సిద్ధం.. అని అనగానే.. తాము కూడా సిద్ధం అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అంటున్నారని అన్నారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత తట్టా బుట్టా సర్దుకుని హైదరాబాద్ కు వెళ్లడానికి ఆ ముగ్గురు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. జగన్ సిద్ధం అంటుంటే.. తాను కూడా సిద్ధం అంటూ.. పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారని.. ఆయన సిద్ధంగా ఉన్నది చంద్రబాబు, లోకేష్ ను భుజానికి ఎత్తుకోవడానికా? లేకపోతే ప్యాకేజీ ఇస్తే పట్టుకొని పోవడానికా? అని ఘాటు విమర్శలు చేశారు.

First Published:  30 Jan 2024 1:43 PM GMT
Next Story