Telugu Global
Andhra Pradesh

నువ్వసలు రాజకీయ విటుడివా? బ్రోకర్‌వా..? – పవన్‌పై విరుచుకుపడ్డ అంబటి

తెలంగాణ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులకు చంద్రబాబు సపోర్ట్‌ ఇస్తున్నాడా లేదా అని మంత్రి అంబటి పవన్‌ను ప్రశ్నించారు.

నువ్వసలు రాజకీయ విటుడివా? బ్రోకర్‌వా..? – పవన్‌పై విరుచుకుపడ్డ అంబటి
X

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నువ్వసలు రాజకీయ విటుడివా? బ్రోకర్‌వా? అంటూ మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీతో.. ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్‌.. రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైజాగ్‌లో బోట్లు దగ్ధమైన ఘటనలో బాధితులకు మూడు రోజుల్లోనే తమ ప్రభుత్వం సుమారు రూ.7.11 కోట్ల చెక్కులు అందజేసిందని మంత్రి చెప్పారు. బోటు విలువలో 80 శాతం ఇవ్వాలని నిర్ణయించి ప్రభుత్వం తక్షణమే వారికి సాయం అందించేందుకు చర్యలు తీసుకుందని వివరించారు. సీఎం జగన్‌ పెద్ద మనసుతో సత్వరం స్పందించి బాధితులకు సాయం అందిస్తే.. దానిని ప్రశంసించకపోగా.. ఆగమేఘాలపై వైజాగ్‌కు చార్టెడ్‌ ఫ్లైట్‌లో వచ్చిన పవన్‌ కల్యాణ్‌ బాధితులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున ఇచ్చి.. ప్రభుత్వాన్ని దూషించే కార్యక్రమం చేపట్టారని మంత్రి అంబటి మండిపడ్డారు.

బాబు చెప్పులు మోయించాలనుకుంటున్నావా?

పవన్‌కి అసలు ఈ రాష్ట్రంతో సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో సొంత ఇల్లు లేదు.. ఓటు కూడా లేదు.. భార్యా పిల్లలూ ఇక్కడ ఉండరు.. చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని వచ్చి సీఎం జగన్‌ని విమర్శించి వెళ్లడం తప్ప ఈ రాష్ట్రంతో నీకేంటి సంబంధం.. అంటూ నిలదీశారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసుకొని.. బానిస బతుకు బతుకుతున్న పవన్‌కల్యాణ్‌.. కాపు సామాజిక వర్గాన్ని కూడా ఆయన వద్ద తాకట్టు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. వారితో బాబు చెప్పులు మోయించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి రంగాను అతి దారుణంగా హత్య చేయించిన చంద్రబాబుకు సామాజికవర్గం మొత్తాన్ని తాకట్టు పెట్టి బానిసలు చేయాలని చూస్తున్నాడని పవన్‌పై మండిపడ్డారు. కాపు సామాజికవర్గాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వ్యక్తి కాదని, అమ్ముకుని బతకాలని వచ్చిన వ్యక్తి అని పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్కడొక నాటకం.. ఇక్కడొక నాటకం..

పవన్‌ కల్యాణ్‌ ఏపీలో టీడీపీతో పొత్తులో ఉండి, తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని, చంద్రబాబు మాత్రం ఏపీలో పవన్‌తో పొత్తు పెట్టుకొని.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌కు అనధికారికంగా మద్దతు పలుకుతున్నాడని మంత్రి అంబటి విమర్శించారు. కాంగ్రెస్‌ మీటింగుల్లో పచ్చ జెండాలు కనిపిస్తుంటే.. బీజేపీ మీటింగుల్లో జనసేన జెండాలు కనిపిస్తున్నాయని.. అక్కడొక నాటకం.. ఇక్కడొక నాటకం.. చంద్రబాబును మించిపోయేలా ఏమిటీ నీచమైన బతుకు అని అంబటి నిలదీశారు. అసలు నువ్వు బీజేపీకి సెకండ్‌ సెటప్‌వా.. లేక టీడీపీకి సెకండ్‌ సెటప్‌వా.. అంటూ తీవ్రంగా విమర్శించారు. నీ బతుకేంటో.. వ్యవహారమేంటో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని మంత్రి హెచ్చరించారు.

కామెడీ గళం మళ్లీ ప్రారంభమవుతోంది...

లోకేష్‌ యువగళం పాదయాత్ర మళ్లీ ప్రారంభించనుండటంపై అంబటి ఈ సందర్భంగా సెటైర్లు వేశారు. ఆగిపోయిన హాస్యభరిత చిత్రం మళ్లీ ప్రారంభం కాబోతోందని, దీనిని కామెడీ గళం అంటారో.. ఏమంటారో మీ ఇష్టం అని వ్యాఖ్యానించారు. అసలు ఎందుకు మొదలు పెట్టాడో.. ఎందుకు ఆపేశాడో.. మళ్లీ ఎందుకు మొదలు పెడుతున్నాడో తెలియదని ఎద్దేవా చేశారు. ఈ అసలు పుత్రుడు చేసే కామెడీ అందరూ చూడొచ్చని ఆయన చెప్పారు.

తెలంగాణలో పవన్‌ అభ్యర్థులకు బాబు సపోర్ట్‌ ఉందా..?

తెలంగాణ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులకు చంద్రబాబు సపోర్ట్‌ ఇస్తున్నాడా లేదా అని మంత్రి అంబటి పవన్‌ను ప్రశ్నించారు. నాకు సపోర్ట్‌ చేయాల్సిన అవసరం లేదు.. నాకు క్యాష్‌ ఇస్తే చాలు అంటే నీ ఇష్టం అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్‌కు బహిరంగంగా సపోర్ట్‌ చేస్తున్నారనేది వాస్తవమని అంబటి చెప్పారు. అలాంటప్పుడు జనసేన తరఫున 8 మంది అభ్యర్థులు ఎందుకు పోటీచేశారనేది వారే ఆలోచించుకోవాలని మంత్రి సూచించారు.

First Published:  27 Nov 2023 2:52 AM GMT
Next Story