Telugu Global
Andhra Pradesh

మార్గదర్శి గోల విచిత్రంగా ఉందే..సింపథీ కోసమేనా?

చిట్టీలు కట్టడానికి వచ్చిన ఖాతాదారులను పట్టుకుని సీఐడీ ఏమీ విచారించలేదే. సోదాలు జరుగుతున్నాయి కాబట్టి రెండు మూడు రోజుల తర్వాత రమ్మని చెప్పి పంపేసింది. ఇంతోటిదానికి సీఐడీ ఖాతాదారులను పెట్టిన ఇబ్బందేముంది? పిల్లా పాపలతో వచ్చిన ఖాతాదారులను ఇబ్బందిపెట్టారని చెప్పటం కేవలం సింపథీ కోసమే.

మార్గదర్శి గోల విచిత్రంగా ఉందే..సింపథీ కోసమేనా?
X

మార్గదర్శి యాజమాన్యం గోల మామూలుగా లేదు. సోదాలను తప్పించుకునేందుకు జనాల సింపథీ కోసం చిత్ర విచిత్రమైన వాదనలను ప్రచారంలోకి తెస్తోంది. తాజాగా చిట్టీల సొమ్ము కడదామని ఖాతాదారులు ఆఫీసులకు వస్తే వాళ్ళని వెనక్కు పంపేశారట. సీఐడీ, పోలీసుల తీరుతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారట. తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి రెండు మూడు రోజుల తర్వాత చిట్టీల డబ్బు కట్టమని చెప్పి వెనక్కు పంపేశారట. ఇందులో సీఐడీ, పోలీసులు ఖాతాదారులను ఇబ్బందులు పెట్టింది ఎక్క‌డో అర్థంకావటంలేదు.

ఎవరింటిమీదైనా ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేస్తే ఏంచేస్తాయి? ముందుగా ఇంట్లోని వాళ్ళందరినీ ఒకేచోట కూర్చోబెడతాయి. ఇంట్లోకి బయటవాళ్ళని రానీయరు. అలాగే ఇంట్లోని వాళ్ళని బయటకు వెళ్ళనీయరు. ఇంట్లో వాళ్ళందరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంటారు. ఒకళ్ళిద్దరు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దగ్గర కూర్చుని విచారిస్తుంటే మిగిలిన వాళ్ళు ఇల్లంతా సోదాలు చేస్తారు. ఇంట్లోకి ఎవరైనా రావాలని అనుకుంటే రైడ్‌ జరుగుతోంది కాబట్టి తర్వాత రమ్మని చెప్పి పంపేస్తారు. మామూలుగా ఎక్కడైనా జరిగేదిదే.

ఇప్పుడు మార్గదర్శి ఆపీసుల్లో కూడా ఇదే జరిగింది. చిట్టీలు కట్టడానికి వచ్చిన ఖాతాదారులను పట్టుకుని సీఐడీ ఏమీ విచారించలేదే. సోదాలు జరుగుతున్నాయి కాబట్టి రెండు మూడు రోజుల తర్వాత రమ్మని చెప్పి పంపేసింది.

ఇంతోటిదానికి సీఐడీ ఖాతాదారులను పెట్టిన ఇబ్బందేముంది? పిల్లా పాపలతో వచ్చిన ఖాతాదారులను ఇబ్బందిపెట్టారని చెప్పటం కేవలం సింపథీ కోసమే. తనిఖీలు, ఆడిటింగ్ జరుగుతున్నపుడు బ్రాంచ్ మేనేజర్లు, అకౌంట్స్ సిబ్బంది సీఐడీ అధికారులకు అందుబాటులో ఉండాలి కదా. అందుకనే ఖాతాదారులకు అదే విషయాన్ని చెప్పి రెండు మూడు రోజుల తర్వాత వచ్చి చిట్టీలు కట్టమని చెప్పారు.. ఇందులో వేధింపులు ఏమున్నాయి? సోదాల్లో లెక్క‌ల్లోని బొక్కలు ఎక్కడ బయటపడతాయో అనే భయం తప్ప రామోజీరావులో ఇంకేమీ కనబడటంలేదు.

మనీ లాండరింగ్, హవాలా, అక్రమాల్లాంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్గదర్శిపై జనాల సానుభూతి తెచ్చుకోవటం కోసమే ఇలాంటి వార్తలు రాసుకుంటున్నారని అర్థ‌మైపోతోంది.

First Published:  1 May 2023 5:50 AM GMT
Next Story