Telugu Global
Andhra Pradesh

మహాసేన రాజేష్‌ యూటర్న్.. బాబు డ్రామాలో ట్విస్ట్‌.?

మహాసేన రాజేష్‌ మరోసారి చంద్రబాబును నమ్మడం విశేషం. పి.గన్నవరం టికెట్‌ మహాసేన రాజేష్‌కు మొదట ప్రకటించినట్లే ప్రకటించి తర్వాత లాగేసుకున్నారు చంద్రబాబు.

మహాసేన రాజేష్‌ యూటర్న్.. బాబు డ్రామాలో ట్విస్ట్‌.?
X

మహాసేన రాజేష్‌ యూటర్న్ తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేయాలన్న ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దలు తనతో చర్చలు జరిపారని.. ఎట్టిపరిస్థితుల్లో పార్టీని వీడి వెళ్లొద్దని సూచించారని తాజాగా ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. తాను లేవనెత్తిన అంశాలపై పార్టీ నుంచి హామీ లభించిందన్నారు మహాసేన రాజేష్‌. బడుగు, బలహీన వర్గాల రక్షణ తెలుగుదేశం తీసుకుంటుందని హామీ ఇచ్చారన్నారు. ఇందుకు సంబంధించిన హామీని పబ్లిక్‌గా ప్రకటిస్తామని తనతో పార్టీ పెద్దలు చెప్పారన్నారు మహాసేన.

అయితే మహాసేన రాజేష్‌ మరోసారి చంద్రబాబును నమ్మడం విశేషం. పి.గన్నవరం టికెట్‌ మహాసేన రాజేష్‌కు మొదట ప్రకటించినట్లే ప్రకటించి తర్వాత లాగేసుకున్నారు చంద్రబాబు. గతంలో బీసీలను, ఎస్సీలను అవమానించిన చంద్రబాబు.. ఆయా వర్గాల రక్షణ తనదని చెబితే మహాసేన రాజేష్‌ నమ్మడం ఆయన అమాయకత్వానికి నిదర్శనం.

రెండు రోజుల క్రితం మహాసేన రాజేష్‌ ఏమన్నారంటే.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకం. దేశమంతా ప్రతీ పార్టీకి ప్రతిపక్షం ఉంది. గుజరాత్‌లో కూడా బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉంది. కానీ ఏపీలో మాత్రం బీజేపీకి ప్రతిపక్షం లేదు. ఇది ప్రజల ఓటు హక్కుని హరించడమేనంటూ ఓ పోస్టు పెట్టారు. ఇక్కడ ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకే పడుతుందని.. అది రాజ్యాంగ విరుద్ధమన్నారు మహాసేన. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి అనుకున్న వారికి ఆ అవకాశాన్ని దూరం చేయకూడదని.. ఆ కారణంగానే రాబోయే ఎన్నికల్లో అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలో పోటీ దిగాలనుకుంటున్నామని చెప్పారు. కానీ, రెండు రోజుల వ్యవధిలోనే ఇదంతా మరిచిపోయిన మహాసేన.. తన రాజీనామా ఆలోచనను విరమించుకున్నారు. మరోవైపు ఇదంతా చంద్రబాబు కుట్రలో భాగంగా ఆడుతున్న నాటకంగా వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు.

First Published:  8 April 2024 3:48 AM GMT
Next Story