Telugu Global
Andhra Pradesh

"ఈ ఈడీ దాడులు రాజకీయ దాడులు కానే కావు...ఇవి కేవలం వ్యాపారపరమైన ఈడీ దాడులే"

తమపై వచ్చిన లిక్కర్ ఆరోపణలు నిరాధారమైనవని ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఈడీ దాడుల నేపథ్యంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో తాము లేమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ఈ ఈడీ దాడులు రాజకీయ దాడులు కానే కావు...ఇవి కేవలం వ్యాపారపరమైన ఈడీ దాడులే
X

తమపై వచ్చిన లిక్కర్ ఆరోపణలు నిరాధారమైనవని ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఈడీ దాడుల నేపథ్యంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో తాము లేమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

తాము 70 ఏళ్ల నుండి లిక్కర్ వ్యాపారం లో ఉన్నామని ఆయన చెప్పారు. 8 రాష్ట్రాలలో తమ వ్యాపారాలు ఉన్నాయని తెలిపారు. ఎక్కడా మచ్చ లేని వ్యాపారం చేస్తున్నామన్నారు. .

చెన్నై, ఢిల్లీ లోని తమ నివాసాల్లో ఈడీ దాడులు జరిగాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఏవిధమైన అక్రమాలూ జరగలేదని ఈడి అధికారులు తేల్చారని చెప్పారు.. పంచనామా లో కూడా ఇదే రాశారని వివరించారు.

తమ పై నే కాదని.. దేశం లో 32 మంది వ్యాపారుల పై కూడా సోదాలు చేశారని గుర్తు చేశారు. తమ కుటుంబం రాజకీయాల్లో, వ్యాపారాల్లో నీతి గా ఉన్నదని చెప్పారు. ఎక్కడా అక్రమాలకు పాల్పడిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.

2024 లో తన కుమారుడు ఒంగోలు ఎంపీ గా పోటీ చేస్తాడని పునరుద్ఘాటించారు. . ఇవి కేవలం వ్యాపారపరమైన ఈడీ దాడులు గానే భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఈడీ దాడులు రాజకీయ దాడులు కానే కాదని స్పష్టం చేశారు.

Next Story