Telugu Global
Andhra Pradesh

ఇలాంటి ఇంగ్లీష్ బోధన మోసం- జేపీ

ఇంగ్లీష్ రాని పిల్లలకు ఇంగ్లీష్ రాని ఉపాధ్యాయులు చదువు చెబితే ఉపయోగం ఏంటి అని ప్ర‌శ్నించారు. ప్రస్తుతం అందరం ఒక సంక్లిష్టమైన సమాజంలో బతుకుతున్నామని.. ఏది మాట్లాడినా వివాదాస్పదం చేస్తున్నారని జేపీ విమర్శించారు.

ఇలాంటి ఇంగ్లీష్ బోధన మోసం- జేపీ
X

పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు అందించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను లోక్‌సత్తా జయప్రకాశ్‌నారాయణ పరోక్షంగా తప్పుపట్టారు. తాను ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదంటూనే ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ప్రభుత్వాల మూర్ఖపు చర్యలతో విద్యావ్యవస్థ దెబ్బతింటోందన్నారు. అసలు ఇంగ్లీష్ రాని టీచర్లతో ఇంగ్లీష్ బోధన ఎలా చేయిస్తారని ప్రశ్నించారు.

ఇంగ్లీష్ రాని పిల్లలకు ఇంగ్లీష్ రాని ఉపాధ్యాయులు చదువు చెబితే ఉపయోగం ఏంటి అని ప్ర‌శ్నించారు. ప్రస్తుతం అందరం ఒక సంక్లిష్టమైన సమాజంలో బతుకుతున్నామని.. ఏది మాట్లాడినా వివాదాస్పదం చేస్తున్నారని జేపీ విమర్శించారు. తాను ఇంగ్లీష్‌ మీడియంకు వ్యతిరేకం కాదని.. కాకపోతే ఇంగ్లీష్ రాని టీచర్లలో బోధన చేయించడం అంటే మనకు మనం మోసం చేసుకోవడమేనని వ్యాఖ్యానించారు. ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడే భాషలోనే చదువు చెబితే పిల్లలకు బాగా అర్థమవుతుందన్నారు. విద్యార్థుల ప్రతిభకు మార్కులు ఏమాత్రం ప్రమాణికం కాదని.. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు.

పిల్లలపై ఒత్తిడి పెంచే చర్యలు మానుకోవాలని సూచించారు. ఒక్కో విద్యార్థిపై ఏపీ ప్రభుత్వం ఏటా 20వేల రూపాయలు ఖర్చు చేస్తోందని.. అయినా ప్రాథమిక విద్య అధ్వాన్నంగానే ఉందన్నారు. విజయవాడలో జరిగిన ''నాణ్యతకు నోచుకోని చదువులెందుకు?'' అన్న కార్యక్రమంలో జేపీ ఈ వ్యాఖ్యలు చేశారు.

First Published:  29 Jan 2023 3:37 AM GMT
Next Story