Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ఇమేజ్‌ని లోకేషే గబ్బు పట్టించాడా?

చంద్రబాబు అవినీతిని జాతీయ స్థాయిలో లోకేషే డప్పుకొట్టి చెప్పినట్లయ్యింది. లోకేష్ ఒకందుకు ఢిల్లీకి వెళితే అందుకు విరుద్ధంగా జరిగింది.

చంద్రబాబు ఇమేజ్‌ని లోకేషే గబ్బు పట్టించాడా?
X

జాతీయ స్థాయిలో చంద్రబాబునాయుడు ఇమేజ్‌ని లోకేషే గబ్బు పట్టించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టును జాతీయ స్థాయికి తీసుకెళ్ళి అన్నీవైపుల నుండి సానుభూతి పొందాల‌ని లోకేష్ పెద్ద ప్లాన్ వేశారు. అందుకనే ఐదు రోజులుగా లోకేష్ ఢిల్లీలోనే క్యాంపు వేసి కొన్ని జాతీయ మీడియాలతో మాట్లాడారు.

అలాగే జాతీయ పార్టీల అధినేతలతో కూడా మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే ఎవరు కూడా లోకేష్‌తో భేటికి సుముఖంగా లేరట. అమిత్ షా అయితే అసలు అపాయిట్మెంటే ఇవ్వలేదు. జాతీయ మీడియా చర్చల్లో కూడా లోకేష్ ఒక విషయానికి వెళితే ఇంకో విషయం బయటపడింది. అదేమిటంటే చంద్రబాబు రూ. 371 కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్నారనే విషయం డిబేట్ల సందర్భంగా బయటపడింది. అసలు ఒప్పందానికి విరుద్ధంగా చంద్రబాబు నిధులను ఎందుకు విడుదల చేశారని అడిగితే లోకేష్ సమాధానం చెప్పలేకపోయారు.

నిధులను విడుదల చేయాలని చంద్రబాబు ఒత్తిడి చేశారని అప్పటి చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ ప్రిన్సిప‌ల్‌ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీలు రాసిన నోబ్ ఫైళ్ళ గురించి అడిగినప్పుడు లోకేష్ నోరిప్పలేకపోయారు. ఎంతసేపు చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా అరెస్టు చేయించారు, తప్పుడు కేసులో ఇరికించారని గోల చేయటంతోనే లోకేష్ ఢిల్లీ పర్యటన సరిపోయింది. లోకేష్ గనుక జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే చంద్రబాబు అవినీతి వ్యవహారం జాతీయ స్థాయిలో ఈ విధంగా ప్రచారం జరిగుండేదే కాదు. అనవసరంగా లోకేష్ కొరివితో గోక్కున్నట్లుగా తయారైంది.

చంద్రబాబు అవినీతిని జాతీయ స్థాయిలో లోకేషే డప్పుకొట్టి చెప్పినట్లయ్యింది. లోకేష్ ఒకందుకు ఢిల్లీకి వెళితే అందుకు విరుద్ధంగా జరిగింది. దాంతో ఏం చేయాలో అర్థంకాక తిరిగి రాజమండ్రికి చేరుకుంటున్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో ఎటు నుంచి కూడా మద్దతు రావటంలేదంటే చంద్రబాబు ఇమేజ్‌ ఎంత మైనస్సులో ఉందో అందరికీ అర్థ‌మవుతోంది. చివరకు పార్లమెంటు దగ్గర ఫ్ల‌కార్డులు పట్టకుని నినాదాలిచ్చినా లోకేష్+టీడీపీ ఎంపీలను ఎవరూ పట్టించుకోలేదు. మొత్తానికి ఢిల్లీకి రావటం ద్వారా చంద్రబాబు ఇమేజ్‌ని లోకేషే గబ్బుపట్టించారనే ప్రచారం పెరిగిపోతోంది.

First Published:  19 Sep 2023 6:04 AM GMT
Next Story