Telugu Global
Andhra Pradesh

పండుగల పవిత్రతను కాపాడుకుందాం

ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల విజయవంతంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

పండుగల పవిత్రతను కాపాడుకుందాం
X

ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్'లో పోస్టు పెట్టారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాల్లో పండుగలు అంతర్భాగంగా ఉంటాయని.. వాటి పవిత్రత కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించారని అన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీకి అభినందనలు తెలిపారు. తిరుమలలో ఏటా 450 ఉత్సవాలు జరుగుతాయి. అన్నింటికంటే బ్రహ్మోత్సవాలు ముఖ్యమైనవి. స్వామివారిని 6 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వాహన సేవలకు 15 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. గతంలో 16 లక్షల మందికి అన్నప్రసాదాలు అందించారు. ఈ ఏడాది 26 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాలు అందించారు. పండగ విశిష్ఠత, వైభవం ఉట్టిపడేలా అద్భుత ఏర్పాట్లు చేశారు. లైట్లతో పాటు ప్రత్యేక డిజిటల్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారని చంద్రబాబు తెలిపారు.

First Published:  13 Oct 2024 6:10 AM GMT
Next Story