Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు మ‌ద్ద‌తుగా.. `లెట్స్ మెట్రో ఫ‌ర్ సీబీఎన్‌`

చంద్రబాబు అరెస్టుకు నిర‌స‌న‌గా ఐటీ ఉద్యోగుల్లోని కొంద‌రు మాత్ర‌మే హైద‌రాబాద్‌లో కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. శ‌నివారం సెల‌వు దినం కావ‌డంతో ఈ నిర‌స‌న‌లో ఐటీ ఉద్యోగులే ఎక్కువ మంది పాల్గొంటార‌ని అంచనా.

చంద్రబాబుకు మ‌ద్ద‌తుగా.. `లెట్స్ మెట్రో ఫ‌ర్ సీబీఎన్‌`
X

చంద్రబాబుకు మ‌ద్ద‌తుగా.. `లెట్స్ మెట్రో ఫ‌ర్ సీబీఎన్‌`

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో అరెస్ట‌యి రాజమండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మద్ద‌తుగా హైద‌రాబాద్‌లోని టీడీపీ శ్రేణులు, అభిమానులు వినూత్న నిర‌స‌న‌కు పిలుపునిచ్చారు. `లెట్స్ మెట్రో ఫ‌ర్ సీబీఎన్` పేరుతో శ‌నివారం నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌బోతున్నారు. హైద‌రాబాద్ మెట్రో రైల్ ఇందుకు వేదిక కానుంది.

న‌ల్ల‌ టీష‌ర్టుల‌తో మియాపూర్ టు ఎల్బీన‌గ‌ర్‌

శ‌నివారం ఉద‌యం 10.30 నుంచి 11.30 గంట‌ల మ‌ధ్య ఎల్బీన‌గ‌ర్ వ‌ర‌కు న‌ల్ల టీష‌ర్టులు ధ‌రించి మెట్రోలో ప్ర‌యాణం చేయాల‌ని టీడీపీ నాయ‌కులు, అభిమానులు పిలుపునిచ్చారు. మియాపూర్ నుంచి ఎల్బీన‌గ‌ర్ వ‌ర‌కు ఎక్క‌డైనా మెట్రో ఎక్కి ఈ నిర‌స‌న‌లో పాల్గొన‌వ‌చ్చ‌ని చెప్పారు. మెట్రో ప్ర‌యాణికుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా నిర‌స‌న తెలపాల‌ని నిర్ణ‌యించారు.

ఐటీ ఉద్యోగులే..

చంద్రబాబు అరెస్టుకు నిర‌స‌న‌గా ఐటీ ఉద్యోగుల్లోని కొంద‌రు మాత్ర‌మే హైద‌రాబాద్‌లో కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. శ‌నివారం సెల‌వు దినం కావ‌డంతో ఈ నిర‌స‌న‌లో ఐటీ ఉద్యోగులే ఎక్కువ మంది పాల్గొంటార‌ని అంచనా. హైదరాబాద్‌లో మెట్రో ఏర్పాటుకు చంద్రబాబు దార్శ‌నిక‌త కూడా కార‌ణ‌మ‌ని, అందుకే ఈ నిర‌స‌న‌ను ఎంచుకున్న‌ట్లు పార్టీ కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు.

First Published:  13 Oct 2023 5:44 AM GMT
Next Story