Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు ఇన్ని రోగాలున్నాయా?

మొత్తం మీద రిపోర్టు చెప్పేదేమంటే చంద్రబాబు మరికొంత కాలం డాక్టర్ల పర్యవేక్షణలోనే పూర్తి విశ్రాంతిలో ఉండాలని. ప్రస్తుతానికి షుగర్, బీపీ అదుపులోనే ఉన్నా దీన్ని కూడా డాక్టర్లు రెగ్యులర్‌గా చెక్ చేస్తుండాలట.

చంద్రబాబుకు ఇన్ని రోగాలున్నాయా?
X

ఇప్పుడు ఈ వార్తే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. చంద్రబాబు హెల్త్‌కు సంబంధించిన రిపోర్టును ఆయన లాయర్ కోర్టుకు సమర్పించారు. ఆ రిపోర్టును చూస్తే చంద్రబాబుకు ఇన్ని రోగాలున్నాయా అని ఆశ్చర్యపోవాల్సిందే. కంటి ఆపరేషన్ కోసమని చంద్రబాబు మెడికల్ బెయిల్ తెచ్చుకున్నప్పుడే చాలామంది అనుకున్నారు. ఏమనంటే కోర్టు ఆదేశించినట్లుగా నవంబర్ 28న చంద్రబాబు మళ్ళీ జైలుకు వెళ్ళరని.

కారణం ఏమిటంటే ఆరోగ్య సమస్యలున్నాయని చెప్పి డాక్టర్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చెప్పి మెడికల్ బెయిల్ పోడిగించుకునేందుకు ప్రయత్నిస్తారని. చాలామంది అనుమానించినట్లుగానే తాజాగా లాయర్ సమర్పించిన రిపోర్టు వివరాలు అలాగే ఉన్నాయి. చంద్రబాబుకు దాదాపు పది రకాల రోగాలున్నాయట. ఆపరేషన్ చేసిన కంటికి మూడు నెలల అబ్జర్వేషన్ అవసరమని డాక్టర్లు అభిప్రాయపడ్డారట. ఐదు వారాల పాటు ప్రతి రోజు కంట్లో చుక్కల మందు వేయాలట. అంతేకాకుండా రెగ్యులర్‌గా కంటికి టెస్టులు చేస్తుండాలట.

అలాగే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి దానికి ట్రీట్‌మెంట్ చాలా అవసరమట. గుండె సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగానే ఉందట, గుండె పరిణామం ఉబ్బిందట. చంద్రబాబు ఎక్కడికి ప్రయాణం చేసినా వెంట ఒక డాక్టరు, హార్ట్ ఎక్విప్మెంటు ఉండాలట. కాల్షియం స్కోర్ ఎక్కువగా ఉందట. గుండెకు రక్తం సరఫరా చేసే రక్త నాళాలు కూడా ఉబ్బాయట. మొత్తం మీద రిపోర్టు చెప్పేదేమంటే చంద్రబాబు మరికొంత కాలం డాక్టర్ల పర్యవేక్షణలోనే పూర్తి విశ్రాంతిలో ఉండాలని. ప్రస్తుతానికి షుగర్, బీపీ అదుపులోనే ఉన్నా దీన్ని కూడా డాక్టర్లు రెగ్యులర్‌గా చెక్ చేస్తుండాలట.

ఇప్పుడు డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు చూసిన తర్వాత ఇదంతా నిజమేనా అన్న సందేహం పెరిగిపోతోంది. ఎందుకంటే అరెస్టుకు ముందు వరకు చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా తాను సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నట్లు చెప్పేవారు. వయసు అన్నది తనకు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని, గట్టిగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఫిజికల్‌గా మెంటల్‌గా చాలా ఫిట్‌గా ఉన్నట్లు చెప్పేవారు. రోజుకు మూడు నాలుగు సభల్లో మాట్లాడటం చూసి జనాలు కూడా నిజమే అనుకున్నారు. మరిప్పుడు అరెస్టు కాగానే ఒక్కసారిగా ఇన్నిరోగాలు ఎలా వచ్చేశాయో అర్థంకాక‌ జనాలు ఆశ్చర్యపోతున్నారు.

First Published:  16 Nov 2023 5:12 AM GMT
Next Story