Telugu Global
Andhra Pradesh

మనవడిపై లక్ష్మీపార్వతి హాట్ కామెంట్స్..

ఫైబర్ నెట్ స్కామ్ లో దోపిడీకి పాల్పడ్డ వాడు నీతిమంతుడి గా ప్రజల ముందుకు వస్తున్నాడంటూ సెటైర్లు వేశారు. కేంద్రం సీరియస్ గా దృష్టి సారిస్తే యువ నాయకుడికి జైలు ఖాయం అని జోస్యం చెప్పారు లక్ష్మీపార్వతి.

మనవడిపై లక్ష్మీపార్వతి హాట్ కామెంట్స్..
X

మనవడు నారా లోకేష్ పై లక్ష్మీపార్వతి హాట్ కామెంట్స్ చేశారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. ఫైబర్ నెట్ స్కామ్ లో దోపిడీకి పాల్పడ్డ వాడు నీతిమంతుడి గా ప్రజల ముందుకు వస్తున్నాడంటూ సెటైర్లు వేశారు. కేంద్రం సీరియస్ గా దృష్టి సారిస్తే యువ నాయకుడికి జైలు ఖాయం అని కూడా జోస్యం చెప్పారు.

చంద్రబాబుకి కూడా కోటింగ్..

చంద్రబాబులో పశ్చాత్తాపం లేదని మండిపడ్డారు లక్ష్మీపార్వతి. 100 రూపాయలు చీర, పుచ్చిపోయిన కందిపప్పు ఇస్తామని పిలిచి అమాయక మహిళల ప్రాణాలు తీశారని అన్నారు. టీడీపీ నాయకులకు అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా ప్రత్యేకమైన రాజ్యాంగం వారికి వేరే ఉందా అని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థపై ఎదురు దాడి చేసే తప్పుడు సంస్కృతి ప్రధాన ప్రతిపక్షం టీడీపీదేనన్నారామె. సంస్కార హీనమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళను చూస్తే, వాళ్ళ పుట్టుక సక్రమమైనదేనా అనే అనుమానం కలుగుతోందని దెప్పిపొడిచారు.

బాలయ్యా.. ఇదేందయ్యా..?

పనిలో పనిగా బాలకృష్ణపైన కూడా సెటైర్లు వేశారు లక్ష్మీపార్వతి. అన్ స్థాపబుల్ కార్యక్రమంలో హంతకులిద్దరూ ఒకరినొకరు సమర్ధించుకున్నట్టు అనిపించిందన్నారామె. ఎన్టీఆర్ ని పొట్టన పెట్టుకున్న చంద్రబాబుని పక్కనకూర్చోబెట్టుకుని ఆ సంఘటనను సమర్థించుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని చెప్పారు. అన్ స్టాపబుల్ షో అంతా అబద్ధమేనన్నారు లక్ష్మీపార్వతి.

అమరావతి ఎవరికోసం..?

రాజధాని అమరావతి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకోసమేనని అన్నారు లక్ష్మీపార్వతి. అమరావతి ఆత్మగౌరవం అనే నినాదం కూడా వ్యాపారులు సృష్టించిందేనన్నారు. సీపీఐ నారాయణ, రామకృష్ణలు పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ప్రజా కంటకంగా మారాయన్నారు.

First Published:  24 Jan 2023 1:36 PM GMT
Next Story