Telugu Global
Andhra Pradesh

రాప్తాడు సభకి జనం వచ్చారా..? తరలించారా..?

‘‘ఫ్యాన్‌ ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. సైకిల్‌ బయటే ఉంటుంది. టీ తాగేశాక గ్లాసు సింకులోనే ఉంటుంది’’ అని జనానికి అర్థం అయ్యే భాషలో జగన్‌ తెలియజెప్పారు.

రాప్తాడు సభకి జనం వచ్చారా..? తరలించారా..?
X

ఆదివారం నాడు అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన జగన్మోహన్‌రెడ్డి సభ లైవ్‌ చూశారా..? పోనీ దినపత్రికల్లో ఫొటోలు చూశారా..? అదేమి జనం..! వేలల్లో కూడా కాదు, లక్షల్లోనే..! అటు, ఇటు, ఎటు చూసినా జనమే. జన సముద్రం అంటే అది. ఒక చిన్న కాల్వ తవ్వగలుగుతాం. ఒక పంట కాల్వని దారి మళ్లించగలుగుతాం. పదివేల మందినో, పోనీ పాతిక వేల మందినో ఒక సభ కోసం రాజకీయ పార్టీలు లారీల్లో, బస్సుల్లో తరలిస్తాయి. లక్షల్లో జనాన్ని తరలించడం సాధ్యమేనా..? జగన్‌ సభలకి జనం తండోపతండాలుగా రావడం మన అందరం చూస్తున్నదే..! ఇదేం కొత్తకాదు. భీమిలి సభ, ఏలూరు దగ్గర దెందులూరు సభ, ఇప్పుడు రాప్తాడు బహిరంగ సభ. కెరటాలు, కెరటాలుగా జనం..!

జనం అలా వెల్లువలా రావడం అంటే అది నమ్మకం. ఒక నాయకుని పట్ల అభిమానం. సహాయం పొందుతున్న పేద, మధ్య తరగతి వర్గాలు పెను ఉప్పెనై విరుచుకుపడ్డారు. వైసీపీ శ్రేణులు ఆనంద కెరటాలపై తేలియాడారు. ‘‘సైకిలెక్కి, ఖాళీ గ్లాసు పట్టుకుని చంద్రముఖి వస్తున్నాడు. బాబుని నమ్ముకుంటే ప్రజల నెత్తురు గ్లాసులో తాగేస్తాడు’’ అని జగన్‌ హెచ్చరించారు. చంద్రబాబు లాంటి దుష్టశక్తిని దూరంగా పెట్టాలని చెప్పారు.

‘‘ఫ్యాన్‌ ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. సైకిల్‌ బయటే ఉంటుంది. టీ తాగేశాక గ్లాసు సింకులోనే ఉంటుంది’’ అని జనానికి అర్థం అయ్యే భాషలో జగన్‌ తెలియజెప్పారు. ఈ మహాసభని చూసి ప్రతిపక్షాలు సహజంగానే జడుసుకున్నాయి. జగన్‌ దుర్మార్గుడనీ, అభివృద్ధి అడ్రస్‌ పోయిందనీ, రాష్ట్రం ఎడారిగా మారిపోయిందనీ, ఐదేళ్ల పాటు తెలుగుదేశం, ఈనాడు, పవన్‌ కళ్యాణ్, ఆంధ్రజ్యోతి, వారి ఛానళ్లూ విసుగూ విరామం లేకుండా నాన్‌స్టాప్‌గా ప్రచారం చేసినా, ఇప్పుడు జగన్‌ సభకి ఇంత జనం రావడం ఏమిటి..? చంద్రబాబు, పవన్‌ల ఓటమి ఖాయం అని వాళ్లకి జ్ఞానోదయం అయ్యే ఉండాలి.

ఫ్యాన్‌ రెక్కల్ని విరిచేస్తాం అంటూ రెచ్చిపోతున్న తెలుగుదేశం వాళ్ల నోళ్లు హఠాత్తుగా పడిపోయాయి. లక్షలాది జనం వచ్చిన, సభ ఖాళీగా ఉందనీ, స్పందన లేదనీ, వచ్చిన వాళ్లు వెళ్లిపోతున్నారనీ రాయడానికి అలవాటుపడిన ఆంధ్రజ్యోతి విలేకరి, ఫొటోగ్రాఫర్ని కొందరు గట్టిగానే కొట్టారు. అబద్ధాలు రాసి జనాన్ని హర్ట్‌ చేసినప్పుడు వాళ్ల ఆగ్రహానికి గురికాక తప్పదు కదా..! పచ్చి అబద్ధాలు రాసినప్పుడు తన్నులు తినడానికీ ‘సిద్ధం’గా ఉండాలి మరి..! చివరికి మిగిలేది..? – చంద్రబాబుకి భయం.. జగన్మోహన్‌రెడ్డికి జయం.

First Published:  20 Feb 2024 2:18 AM GMT
Next Story