Telugu Global
Andhra Pradesh

దొడ్డిదారిన లడ్డూలు.. పోలీసుల అదుపులో టీటీడీ ఉద్యోగులు

17 ట్రేలు మిస్ కావడంతో ప్రతి రోజూ లడ్డూల షార్టేజ్ వస్తోంది. దీంతో పేష్కార్ నిఘా పెట్టారు. వేల సంఖ్యలో లడ్డూలు పక్కదారి పట్టినట్టు తెలుస్తోంది.

దొడ్డిదారిన లడ్డూలు.. పోలీసుల అదుపులో టీటీడీ ఉద్యోగులు
X

తిరుమల శ్రీవారి సేవలో తరించాల్సిన వారే ఆయన సన్నిధిలోనే దొంగతనాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఆమధ్య పరకామణిలో తనిఖీ సిబ్బంది చేతివాటాన్ని పోలీసులు కనిపెట్టారు, ఇప్పుడు బూందీపోటులో లడ్డూ ట్రేలు మాయం కావడానికి కారణమైన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవల శ్రీవారి బూందీ పోటులో లడ్డూ ట్రేల లెక్కల్లో తేడా వస్తోంది. లడ్డూ ట్రేలు మాయమవుతున్న విషయం విజిలెన్స్ సిబ్బంది వరకు వెళ్లింది. బూందీ పోటు పేష్కార్ ఫిర్యాదుతో విజిలెన్స్ సిబ్బంది నిఘా పెట్టారు. 17 లడ్డూ ట్రేలను తీసుకెళ్లి బ్లాక్ లో విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఇందులో టీటీడీ శాశ్వత ఉద్యోగి కూడా ఉండటం విశేషం. మరో నలుగురు కాంట్రాక్ట్ సిబ్బందిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

శ్రీవారి బూందీ‌ పోటులో లడ్డూలు తయారు చేసిన వాటిని ట్రేల ద్వారా విక్రయశాలకు పంపిస్తారు. రోజుకి మూడున్నర లక్షలనుంచి 4 లక్షల వరకు లడ్డూలు తయారు చేస్తుంటారు. 17 ట్రేలు మిస్ కావడంతో ప్రతి రోజూ లడ్డూల షార్టేజ్ వస్తోంది. దీంతో పేష్కార్ నిఘా పెట్టారు. వేల సంఖ్యలో లడ్డూలు పక్కదారి పట్టినట్టు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టారు. ఎన్నిలడ్డూలను అక్రమ మార్గంలో తరలించారు, ఎలా అమ్మకాలు కొనసాగించారనే విషయాలను ఆరా తీస్తున్నారు. అప్పటికప్పుడు వారి వద్దనుంచి 15 లడ్డూ ట్రేలు, 750 లడ్డూలను స్వాధీనం చేసుకున్నారు.

First Published:  19 May 2023 9:29 AM GMT
Next Story