Telugu Global
Andhra Pradesh

మాధవ్‌ గొప్ప మానవతావాది.. కురవ సంఘం భారీ ర్యాలీ

మానవతవాది, నిజాయితీ పరుడైన మాధవ్‌పై కుట్ర పూరితంగా ఫేక్ వీడియోలు సృష్టించారని కురవ సంఘం నేతలు ఆరోపించారు.

మాధవ్‌ గొప్ప మానవతావాది.. కురవ సంఘం భారీ ర్యాలీ
X

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారం ఇప్పుడు కులం రంగు పులుముకుంటోంది. గోరంట్ల మాధవ్‌కు మద్దతుగా అనంతపురం నగరంలో ఆయన కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు, నారా లోకేష్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌.. నిప్పు అని నినాదాలు చేశారు.

మాధవ్ జోలికి వస్తే ఊరుకోబోమని కురవ కులస్తులు హెచ్చరించారు. కురవ సింహాం మాధవ్ అంటూ నినాదాలు చేశారు. నారా లోకేష్ పప్పు.. గోరంట్ల మాధవ్ నిప్పు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

గోరంట్ల మాధవ్‌కు మద్దతుగా కురవ సంఘం నేతలు, వైసీపీ నేతలు స్థానికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మానవతవాది, నిజాయితీ పరుడైన మాధవ్‌పై కుట్ర పూరితంగా ఫేక్ వీడియోలు సృష్టించారని కురవ సంఘం నేతలు ఆరోపించారు. మాధవ్ ఒక గొప్ప నాయకుడని అది జీర్ణించుకోలేక ఇలాంటి ప్రచారం చేస్తున్నారని వారు వ్యాఖ్యానించారు.

స్థానిక ప్రజలు మాధవ్‌ను గబ్బర్‌ సింగ్‌, డైనమిక్ లీడర్‌గా పిలుచుకుంటారని.. అలాంటి గొప్ప నాయకుడిపై ఈ తరహా ప్రచారం ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోందని మీడియా సమావేశంలో కురవ సంఘం నేతలు వ్యాఖ్యానించారు.

First Published:  7 Aug 2022 8:51 AM GMT
Next Story