Telugu Global
Andhra Pradesh

పవర్ స్టార్ కు సూపర్ స్టార్ రూపంలో కష్టాలు

నోటి దురుసు తగ్గించుకోవాలంటూ పవన్ ని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. కృష్ణ అభిమానులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

పవర్ స్టార్ కు సూపర్ స్టార్ రూపంలో కష్టాలు
X

ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ నోరు జారి తిప్పలు కొని తెచ్చుకున్నారు. అనవసరంగా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యారు. ప్రచారంలో భాగంగా కృష్ణ గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కృష్ణను కించపరిచేలా ఉన్న ఆ వ్యాఖ్యలతో అభిమానులు హర్ట్ అయ్యారు. పవన్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

అసలు పవన్ ఏమన్నారు..?

ఎన్టీఆర్ హయాంలో జరిగిన రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. అప్పట్లో ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ కాంగ్రెస్ లో ఉండేవారని, ఎన్టీఆర్ ని కూడా ఆయన విమర్శించారని గుర్తు చేశారు. అలా విమర్శించినా ఎన్టీఆర్ మాత్రం కృష్ణపై ఎప్పుడూ ప్రతి విమర్శలు చేయలేదని అది ఆయన గొప్పతనం అని అన్నారు పవన్. అంటే అక్కడ ఎన్టీఆర్ గొప్పలు చెప్పే క్రమంలో కృష్ణను తక్కువ చేశారు. అది ఫ్యాన్స్ కి నచ్చలేదు. పక్కన పురంధేశ్వరి ఉంది కాబట్టి, ఎన్టీఆర్ ని పొగడాలనుకుంటే తప్పేం లేదని, అదే సమయంలో కృష్ణపై నిందలు వేయడం దేనికని అంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. పవన్ కల్యాణ్ పై దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు.

నోటి దురుసు తగ్గించుకోవాలంటూ పవన్ ని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. కృష్ణ అభిమానులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికల టైమ్ లో పవన్ ఇలా నోరుజారడం, కృష్ణ, మహేష్ బాబు అభిమానుల్ని హర్ట్ చేయడంతో కూటమికి నష్టం జరుగుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికైనా ప్రసంగాల విషయంలో పవన్ కల్యాణ్ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

First Published:  23 April 2024 6:24 AM GMT
Next Story