Telugu Global
Andhra Pradesh

ఆర్జీవీ తల నరికితే కోటి - కొలికపూడి.

కొలికపూడి వ్యాఖ్యలపై స్పందిస్తూ వరుస ట్వీట్స్‌ చేశారు రామ్‌గోపాల్‌ వర్మ. కొలికపూడిని నివారిస్తున్నట్లు నటిస్తూనే యాంకర్‌ తనను చంపించడానికి మూడు సార్లు కాంట్రాక్ట్ ఇప్పించాడంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ.

ఆర్జీవీ తల నరికితే కోటి - కొలికపూడి.
X

ప్రముఖ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తల నరికి తీసుకువస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ పరాన్నజీవి పేరిట టీవీ-5 టీవీ ఛానల్‌లో ఏర్పాటు చేసిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కొలికపూడి ఈ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా రామ్‌గోపాల్‌ వర్మే ట్వీట్ చేయడం గమనార్హం.


ఇక కొలికపూడి వ్యాఖ్యలపై స్పందిస్తూ వరుస ట్వీట్స్‌ చేశారు రామ్‌గోపాల్‌ వర్మ. కొలికపూడిని నివారిస్తున్నట్లు నటిస్తూనే యాంకర్‌ తనను చంపించడానికి మూడు సార్లు కాంట్రాక్ట్ ఇప్పించాడంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఇక మరో ట్వీట్‌లో చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌కల్యాణ్‌లను ట్యాగ్ చేసిన రామ్‌గోపాల్ వర్మ.. హింస, గూండాయిజం, ఉగ్రవాదులంటూ ఇతర పార్టీలను మీరు విమర్శించడం జోక్‌ అంటూ సెటైర్లు వేశారు.


మరో ట్వీట్‌లో కొలికపూడి వ్యాఖ్యలపై ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆర్జీవీ. కొలికపూడి శ్రీనివాస రావు తనను చంపించడానికి కోటి రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చాడని ట్వీట్‌లో పేర్కొన్నారు. టీవీ-5 యాంకర్ సాంబ సైతం చాలా తెలివిగా.. తన హత్యకు సంబంధించి కొలికపూడి చేసిన వ్యాఖ్యలను 3 సార్లు పునరావృతం చేసేలా వ్యవహరించాడన్నారు. ఇదే అధికారిక ఫిర్యాదుగా స్వీకరించాలని ఏపీ పోలీసులను కోరారు ఆర్జీవీ.


ఏపీ సీఎం జగన్‌ రాజకీయ నేపథ్యం ఆధారంగా రాంగోపాల్‌ వర్మ `వ్యూహం` పేరుతో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 29న సినిమాను రిలీజ్ చేస్తానని ప్రకటించారు ఆర్జీవీ. దీంతో అప్పటినుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల నుంచి వర్మకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. సోమవారం కొంత మంది వ్యక్తులు హైదరాబాద్‌లోని ఆయన ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు.

First Published:  27 Dec 2023 2:52 AM GMT
Next Story