Telugu Global
Andhra Pradesh

లోకేశ్‌, పవన్‌ ఇజ్జత్ తీసేసిన కేఏ పాల్

బుద్ధి లేని వాడే తెలుగుదేశం జెండాలు మోస్తారన్నారు. 25 సీట్ల కోసం పవన్‌కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి కుక్కలా అమ్ముడుపోయాడంటూ తీవ్ర విమర్శలు చేశారు పాల్.

లోకేశ్‌, పవన్‌ ఇజ్జత్ తీసేసిన కేఏ పాల్
X

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పరువు తీసేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఓ మీడియా సమావేశంలో పాల్‌ మాట్లాడుతూ లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ నేతలపై దాడులు చేసి 12 కేసులు పెట్టించుకుంటేనే తన అపాయింట్‌మెంట్ ఇస్తానని లోకేశ్‌ అంటున్నాడన్నారు. అసలు లోకేశ్‌ అపాయింట్‌మెంట్ ఎవడికి కావాలన్నారు పాల్. బుద్ధి లేని గాడిదలకు మాత్రమే లోకేశ్‌ అపాయింట్‌మెంట్ అవసరమన్నారు. లోకేశ్‌ తండ్రి చంద్రబాబు తన ముందు 22 సార్లు నిలబడ్డాడని చెప్పారు.


బుద్ధి లేని వాడే తెలుగుదేశం జెండాలు మోస్తారన్నారు. 25 సీట్ల కోసం పవన్‌కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి కుక్కలా అమ్ముడుపోయాడంటూ తీవ్ర విమర్శలు చేశారు పాల్. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు పాల్.

First Published:  20 Feb 2024 4:06 AM GMT
Next Story