Telugu Global
Andhra Pradesh

వెంటాడుతున్న జూనియర్ అభిమానులు.. రచ్చ రచ్చ

రెండు బహిరంగ సభల్లోనూ వలంటీర్లకు, అభిమానులకు జరిగిన గొడవలే బాగా హైలైట్ అయ్యాయి. చంద్రబాబు వేదికమీద ఉండగానే సభలో గొడవలయ్యాయి.

వెంటాడుతున్న జూనియర్ అభిమానులు.. రచ్చ రచ్చ
X

చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వెంటాడుతున్నారు. తిరువూరు, ఆచంట బహిరంగ సభల్లో రచ్చ రచ్చ చేశారు. చంద్రబాబు వేదికమీదకు రావటానికి ముందే జూనియర్ అభిమానులు జూనియర్ ఫొటోలున్న బ్యానర్లు, జెండాలు పట్టుకుని సభలోకి ఎంటరయ్యారు. ముఖ్యమంత్రి జూనియర్ అంటూ నినాదాలు చేశారు. దాంతో సభ నిర్వహణలో ఉన్న టీడీపీ వలంటీర్లు అభిమానులను అడ్డుకున్నారు. జెండాలు, బ్యానర్లను లాగేసుకుని చించేశారు. జూనియర్ అభిమానులు తిరగబడ్డారు. దాంతో రెండువైపులా పెద్ద గొడవలే అయ్యాయి.

జూనియర్ అభిమానులపై టీడీపీ వలంటీర్లు దాడిచేయటంతో గొడవ మొదలైంది. తిరువూరు, ఆచంటలో ఒకే పద్దతిలో వలంటీర్లు అభిమానులపై దాడులు చేయటం గమనార్హం. దాంతో రెండు సభల్లోనూ అభిమానులు తిరగబడటంతో ఇటు వలంటీర్లు అటు అభిమానుల మధ్య పెద్ద గొడవలయ్యాయి. రెండువైపుల కూడా కర్రలతో ఒకళ్ళపై మరొకళ్ళు దాడులు చేసుకున్నారు. జూనియర్ సీఎం.. సీఎం అంటూ అభిమానులు చేసిన నినాదాలతో టీడీపీ నేతలు, వలంటీర్లకు మండిపోయింది. దాంతో సభల్లో ఉద్రిక్తత‌లు మొదలయ్యాయి.

రెండు బహిరంగ సభల్లోనూ వలంటీర్లకు, అభిమానులకు జరిగిన గొడవలే బాగా హైలైట్ అయ్యాయి. చంద్రబాబు వేదికమీద ఉండగానే సభలో గొడవలయ్యాయి. ఇప్పుడే కాదు కుప్పంలో చంద్రబాబు ఎప్పుడు పర్యటించినా, సభలు నిర్వహించినా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బ్యానర్లు, జెండాలు పట్టుకుని ప్రత్యక్షమవుతున్నారు. కుప్పం అనేకాదు చంద్రబాబు, లోకేష్ సభలు ఎక్కడున్నా జూనియర్ ఫొటోలతో భారీఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు కనబడుతున్నాయి. దాంతో చంద్రబాబు, లోకేష్ కు చిర్రెత్తుతోంది. అభిమానులు జూనియర్ ఫొటోలతో ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడం టీడీపీ నేతలు, వలంటీర్లు వాటిని చించేయటం మామూలైపోయింది.

ఒంగోలు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో జరిగిన సభల్లో కూడా ఇవే ఘటనలు కనిపించాయి. దాంతో చంద్రబాబును జూనియర్ అభిమానులు వెంటాడుతున్నారా..? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అభిమానులపై చంద్రబాబు ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు. ఎందుకంటే.. వాళ్ళలో చాలామందికి టీడీపీతో సంబంధాలు లేవు. వాళ్ళు అచ్చంగా జూనియర్ అభిమానులు మాత్రమే. జూనియర్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని, కాబోయే సీఎం జూనియరే అని సభల్లో నినాదాలు ఇస్తుంటే చంద్రబాబు సహించలేకపోతున్నారు. అయినా వాళ్ళని భరించటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. అవి పరాకాష్టకు చేరుకుని తిరువూరు, ఆచంట బహిరంగసభల్లో కొట్టుకునే దాకా చేరుకున్నది. మున్ముందు ఇంకేమవుతుందో చూడాలి.

First Published:  8 Jan 2024 5:48 AM GMT
Next Story