Telugu Global
Andhra Pradesh

జూనియర్ మౌనంపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

అచ్చెన్నాయుడిపై అప్పుడే ట్రోలింగ్ మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీని టార్గెట్ చేస్తూ పోస్టింగ్ లు పెడుతున్నారు. ఎన్టీఆర్ ని స్పందించాలి అని అడిగే హక్కు ఎవరికీ లేదంటున్నారు ఆయన అభిమానులు.

జూనియర్ మౌనంపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
X

ఆయన్నెళ్లి అడగవయ్యా..

నన్నడిగితే నేనేెం చెబుతాను..

నీ ప్రశ్నలన్నిటికీ ఆయనే సమాధానం చెప్పాలి..

జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై అచ్చెన్నాయుడు మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మౌనంగా ఎందుకు ఉన్నారో ఆయన్నే అడగాలన్నారు. నన్నడిగితే నేనేం చెబుతానంటూ విసుక్కున్నారు. తామెవర్నీ స్పందించాలని బతిమిలాడటం లేదని, అడగడం లేదని చెప్పారు. స్వచ్ఛందంగా అందరూ తమకు తామే చంద్రబాబు అరెస్ట్ కి వ్యతిరేకంగా స్పందిస్తున్నారని, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారని అన్నారు అచ్చెన్నాయుడు. తామవెర్ని స్పందించాలని అడగబోమన్నారు.

రచ్చ మొదలైంది..

జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై టీడీపీలో ఓ వర్గం మండిపడుతోంది. మరోవర్గం ఆయనకు జరిగిన అవమానంపై సింపతీ చూపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ గుర్తు రాడు, అదే టీడీపీ అధికారంలో లేనప్పుడు మాత్రం ఆయన కావాల్సివచ్చాడా అని ప్రశ్నిస్తున్నారు కొందరు. కనీసం చంద్రబాబు అరెస్ట్ పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే తీరిక అయినా జూనియర్ కి లేదా అని అడుగుతున్నారు ఇంకొందరు. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడి హోదాలో అచ్చెన్నాయుడి స్పందన మాత్రం మరింత రచ్చలేపింది.

నందమూరి అభిమానుల ట్రోలింగ్..

అచ్చెన్నాయుడిపై అప్పుడే ట్రోలింగ్ మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీని టార్గెట్ చేస్తూ పోస్టింగ్ లు పెడుతున్నారు. ఎన్టీఆర్ ని స్పందించాలి అని అడిగే హక్కు ఎవరికీ లేదంటున్నారు ఆయన అభిమానులు. గతంలో ప్రచారానికి వాడుకుని వదిలేసి, ఇప్పుడు మళ్లీ జూనియర్ జపం చేయడం ఏంటని అడుగుతున్నారు. అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని పోస్ట్ లు పెడుతున్నారు. మొత్తమ్మీద జూనియర్ మౌనం అనే తేనెతుట్టెను అచ్చెన్నాయుడు కదిపారు. దాని ప్రభావం టీడీపీపై ఎలా ఉంటుందో చూడాలి.


First Published:  15 Sep 2023 10:55 AM GMT
Next Story