Telugu Global
Andhra Pradesh

టీడీపీపై భగ్గుమంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరోకి ట్విట్టర్ వేదికగా మద్దతు తెలుపుతున్నారు. 'జూనియర్ ఎన్టీఆర్ కాళ్ళకింద నారా కుక్కలు' అని అర్థం వచ్చే విధంగా #JrNtrFootNaraDogs అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.

టీడీపీపై భగ్గుమంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
X

ట్విట్టర్ వేదికగా టీడీపీపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్

ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును వైయస్సార్ వైద్య విశ్వవిద్యాలయంగా మార్చుతూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని టీడీపీ శ్రేణులు, నందమూరి కుటుంబం తీవ్రంగా ఖండించింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ పై టీడీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. తాత పేరు ఉన్న వర్సిటీ పేరు మార్చితే స్పందించే తీరు ఇదేనా అంటూ.. పలువురు టీడీపీ నాయకులు ఎన్టీఆర్ ని విమర్శించారు.

ఎన్టీఆర్ స్థాయి.. వైయస్సార్ స్థాయి ఒకటే అని చెప్పడం ఏంటి? అని జూనియర్ పై మండిపడ్డారు. ఎల్లో మీడియా కూడా ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ని విమర్శిస్తూ కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరోకి ట్విట్టర్ వేదికగా మద్దతు తెలుపుతున్నారు. 'జూనియర్ ఎన్టీఆర్ కాళ్ళకింద నారా కుక్కలు' అని అర్థం వచ్చే విధంగా #JrNtrFootNaraDogs అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.

ఈ హ్యాష్ ట్యాగ్ పేరిట ఇప్పటికే కొన్ని వేల ట్వీట్లు వచ్చాయి. ఎన్టీఆర్ కు ఉన్నంత స్థాయి టీడీపీలో ఎవరికీ లేదని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా బాహుబలి సినిమాలో అతి పెద్ద బాహుబలి విగ్రహాన్ని జూనియర్ ఎన్టీఆర్ గా, దాని ముందే చిన్న బాహుబలి విగ్రహాన్ని ఉంచి దాన్ని టీడీపీ గా పోల్చుతూ ఉన్న పోస్టర్లను ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పేరు మార్పుతో వైసీపీ వర్సెస్ టీడీపీగా ఈ వివాదం మొదలు కాగా ఇప్పుడు ఇది టీడీపీ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా మారింది.

First Published:  24 Sep 2022 5:27 AM GMT
Next Story