Telugu Global
Andhra Pradesh

బాలకృష్ణ గోల్డెన్ జూబ్లి.. జూనియర్‌కు అందని ఆహ్వానం!

ఎన్నికల్లో టీడీపీ గెలవడం, చంద్రబాబు నాలుగో సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం జరిగిపోయింది. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి కుటుంబసభ్యులందరికీ ఆహ్వానం అందింది. కానీ ఒక్క జూనియర్‌ ఎన్టీఆర్‌కు తప్ప.

బాలకృష్ణ గోల్డెన్ జూబ్లి.. జూనియర్‌కు అందని ఆహ్వానం!
X

బాలకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నోవాటెల్‌లో ఈ వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయబోతుంది టాలీవుడ్‌. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకాబోతున్న ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు సినీ ప్రముఖులకు ఆహ్వానం అందింది. ఐతే బాలకృష్ణకు స్వయానా అన్న కొడుకు, సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని మోస్తున్నాడని పేరున్న జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రం ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. జూనియర్‌తో పాటు కల్యాణ్‌రామ్‌కు కూడా పిలుపు లేదన్న సమాచారం టాలీవుడ్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.

నిజానికి జూనియర్‌ ఎన్టీఆర్‌తోపాటు కల్యాణ్‌రామ్‌ను మిగతా ఫ్యామిలీ మెంబర్స్‌ దూరం పెడుతున్నారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. గతంలో సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సైతం జూనియర్‌కు పిలుపు అందలేదని వార్తలు వచ్చాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా గానీ, మద్దతుగా గానీ జూనియర్, కల్యాణ్‌రామ్ స్పందించలేదు. ఐతే ఎన్నికల్లో టీడీపీ గెలవడం, చంద్రబాబు నాలుగో సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం జరిగిపోయింది. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి కుటుంబసభ్యులందరికీ ఆహ్వానం అందింది. కానీ ఒక్క జూనియర్‌ ఎన్టీఆర్‌కు తప్ప.

గతంలోనూ జూనియర్‌ను బాలకృష్ణ దూరం పెట్టిన సందర్భాలున్నాయి. శతజయంతి టైంలో ఎన్టీఆర్ ఘాట్‌లో జూనియర్ ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను బాలకృష్ణ తొలగించాలని ఆదేశించారు. ఇక పలు సందర్భాల్లో టీడీపీ నేతలు, వైవీఎస్ చౌదరి లాంటి డైరెక్టర్లు పరోక్షంగా జూనియర్‌పై విమర్శలు సైతం గుప్పించారు. జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని, అసలైన వారసుడు లోకేషేనంటూ బుద్దా వెంకన్న బహిరంగ ప్రకటనలు చేశారు. ఇక వైవీఎస్ చౌదరి సైతం ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎన్టీఆర్ అయిపోరంటూ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో ఉద్దేశపూర్వకంగానే జూనియర్‌ను దూరం పెడుతున్నారన్న చర్చ చాలాకాలంగా జరుగుతోంది.

First Published:  31 Aug 2024 3:45 AM GMT
Next Story