Telugu Global
Andhra Pradesh

జేసీ ప్రభాకర్‌ రెడ్డిని వివిధ ప్రాంతాల్లో తిప్పుతున్న పోలీసులు

జేసీ ప్రభాకర్ రెడ్డిని తీసుకెళ్తున్న వాహనం నుంచి ఆయన గన్‌మెన్‌లను పోలీసులు దింపేశారు. ప్రభాకర్ రెడ్డిని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా శింగనమల, గార్లదిన్నె, గుత్తి, పామిడి ప్రాంతాల్లో పోలీసులు తిప్పుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

జేసీ ప్రభాకర్‌ రెడ్డిని వివిధ ప్రాంతాల్లో తిప్పుతున్న పోలీసులు
X

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెన్నా నదిలో అక్రమంగా ఇసుక తవ్వుతున్నారంటూ జేసీ ప్రభాకర్ ఆందోళనకు దిగారు. ఇసుక రీచ్‌ వద్ద బైఠాయించారు. మైనింగ్ నిబంధనలకు విరుద్దంగా ఇసుక తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. పెద్దపప్పూరు మండల పరిధిలోని రీచ్‌ వద్ద జేసీ ఆందోళనకు దిగారు.

తాను ఎన్నిసార్లు చెప్పినా మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు జేసీ. రీచ్‌ వద్ద బైఠాయించిన జేసీ ప్రభాకర్ రెడ్డితో తొలుత పోలీసులు చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని కోరారు. అందుకు ప్రభాకర్ రెడ్డి నిరాకరించడంతో బలవంతంగా తీసుకెళ్లారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని తీసుకెళ్తున్న వాహనం నుంచి ఆయన గన్‌మెన్‌లను పోలీసులు దింపేశారు. ప్రభాకర్ రెడ్డిని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా శింగనమల, గార్లదిన్నె, గుత్తి, పామిడి ప్రాంతాల్లో పోలీసులు తిప్పుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

నదిలో కేవలం మూడు అడుగుల వరకు మాత్రమే ఇసుక తవ్వాలని నిబంధనలు చెబుతున్నాయని.. ఇక్కడ మాత్రం ఏకంగా 20 అడుగుల వరకు తవ్వేస్తున్నారని జేసీ ఆరోపించారు. ఇలా 20 అడుగుల మేర తవ్వడానికి అనుమతులు ఉంటే వాటిని చూపెట్టాలని లేనిపక్షంలో తవ్విన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. వందల టిప్పర్లతో రాత్రింబవళ్లు ఇసుకను తరలిస్తున్నారని జేసీ చెబుతున్నారు. 20 అడుగుల మేర ఇసుక ఇవ్వడం వల్ల నదిలో పెద్ద గోతులు ఏర్పడ్డాయని.. ఇటీవల ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారని చెప్పారు.

First Published:  9 Feb 2023 9:29 AM GMT
Next Story