Telugu Global
Andhra Pradesh

ఈడీ ముందు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి

ప్రభాకర్‌ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇద్దరిని వేర్వేరుగా విచారించారు. బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌-4 వాహనాలుగా నమ్మించి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ కేసు నమోదైంది.

ఈడీ ముందు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి
X

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారం జేసీ కుటుంబాన్ని వదలడం లేదు. ఈ కేసులో ఇది వరకే జూన్‌ నెలలో జేసీ బ్రదర్స్, వారి అనుచరుల నివాసాలపై ఈడీ దాడులు నిర్వహించింది. కీలకపాత్రాలు స్వాధీనం చేసుకుంది. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో దాడులు జరిగాయి.

తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ఈడీ విచారించింది. ప్రభాకర్‌ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇద్దరిని వేర్వేరుగా విచారించారు. బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌-4 వాహనాలుగా నమ్మించి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ కేసు నమోదైంది.

స్థానిక పోలీసులు కూడా ఈ కేసులో దర్యాప్తు చేసి జేసీ ట్రావెల్స్‌పై 33 కేసుల్లో చార్జిషీట్ సిద్ధం చేశారు. వాటిని స్థానిక కోర్టుల్లో సమర్పించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య జేసీ ఉమా రెడ్డి, కుమారుడు అస్మిత్ రెడ్డి, ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డితో సహా 23 మందిపై ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కేసులు నమోదు అయ్యాయి.

First Published:  7 Oct 2022 10:17 AM GMT
Next Story