Telugu Global
Andhra Pradesh

జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి.. ఎందుకంటే?

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ దాడిపై జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ స్పందించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి.. ఎందుకంటే?
X

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై రాత్రి కొంతమంది దుండగులు దాడి చేశారు. రాళ్లు, కర్రలతో ఎమ్మెల్యే కారును పూర్తిగా ధ్వంసం చేశారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు సమీపంలో ఈ దాడి జరిగింది. ఎమ్మెల్యే బాలరాజును టార్గెట్‌ చేసుకుని ఆయన వెహికిల్‌పై కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగారు.

ఎమ్మెల్యే బాలరాజు కారుపై దాడి కలకలం రేపుతోంది. అయితే దాడి జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే లేరని పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే ఇంటి నుంచి కారు జీలుగుమిల్లి వైపు వెళ్తుండగా కొందరు వ్యక్తులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని..ఈ దాడిలో కియా కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు. దాడి సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని సమాచారం. దాడికి కారణాలు తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ దాడిపై జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ స్పందించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

అంతకుముందు కన్నాపురం ITDA ఆఫీసును ఆకస్మిక తనిఖీ చేశారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఆ సమయంలో ఓ ఉద్యోగి పబ్జీ గేమ్‌ ఆడుతుండడాన్ని గమనించిన ఎమ్మెల్యే.. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, సాధారణ వ్యక్తిలా, ముఖానికి మాస్కు ధరించి రావడంతో ఎమ్మెల్యేను ఉద్యోగులు గుర్తుపట్టలేదు. సెక్షన్ ఆఫీసర్ సాయి కుమార్‌ పబ్జీ ఆడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

First Published:  30 July 2024 2:49 AM GMT
Next Story