Telugu Global
Andhra Pradesh

రోజాపై అనుచిత వ్యాఖ్యలు - జనసేన నేత అరెస్ట్

వెంటనే మరికొందరు వచ్చారని.. హఠాత్తుగా కిరణ్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లారని ఆమె వివరించారు. కిరణ్ అరెస్ట్‌ను నిరసిస్తూ తొలుత ఎస్పీ కార్యాలయం ఎదుట జ‌నసేన శ్రేణులు ఆందోళనకు దిగారు.

రోజాపై అనుచిత వ్యాఖ్యలు - జనసేన నేత అరెస్ట్
X

తరచూ ప్రెస్‌మీట్లు పెట్టి మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జనసేన నేత కిరణ్ రాయల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రోజా వ్యక్తిత్వంపైనా ఆయన నేరుగానే తిరుపతి వేదికగా ప్రెస్‌మీట్లు పెట్టి బూతులు మాట్లాడుతుండేవారు. ఈ నేపథ్యంలో రోజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిరణ్ రాయల్‌ను అరెస్ట్ చేశారు.

అనంతరం నగరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం సాయంత్రం ఫోన్ చేసిన ఒక పోలీసు అధికారి నోటీసులు ఇవ్వాల్సి ఉంది.. ఇంటి అడ్రస్ చెప్పాల్సిందిగా కోరారని కిరణ్ భార్య చెబుతున్నారు. అలా నోటీసు ఇచ్చే పేరుతో ఒకరు రాగా.. ఆ తర్వాత వెంటనే మరికొందరు వచ్చారని.. హఠాత్తుగా కిరణ్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లారని ఆమె వివరించారు. కిరణ్ అరెస్ట్‌ను నిరసిస్తూ తొలుత ఎస్పీ కార్యాలయం ఎదుట జ‌నసేన శ్రేణులు ఆందోళనకు దిగారు.

కిర‌ణ్‌ను నగరి పోలీస్ స్టేషన్‌కు తరలించారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అయితే రాజకీయ విమర్శలు చేయవచ్చు గానీ.. కిరణ్‌ రాయల్ మాత్రం.. మహిళా అని కూడా చూడకుండా మంత్రిగా ఉన్నరోజాపై అత్యంత దారుణంగా ప్రెస్‌మీట్లలో పదేపదే మాట్లాడారు. ఈ అరెస్ట్ కక్షపూరితమని జనసేన వారు ఆరోపిస్తున్నారు.

Next Story