Telugu Global
Andhra Pradesh

దాడి కేసులో జనసేనకు కాస్త ఊరట

అరెస్టయిన వారిలో 65 మందికి రు. 10 వేల పర్సనల్ షూరిటి తీసుకుని కోర్టు బెయిల్ ఇచ్చింది. మరో 9 మందికి 14 రోజుల రిమాండు విధించింది. మరో తొమ్మిది మంది మీద పోలీసులు పెట్టిన హత్యానేరం కేసును కోర్టు మార్చింది.

దాడి కేసులో జనసేనకు కాస్త ఊరట
X

విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపై జరిగిన దాడికేసులో జనసేనకు కాస్త ఊరట దక్కింది. అరెస్టయిన వారిలో 65 మందికి రు. 10 వేల పర్సనల్ షూరిటి తీసుకుని కోర్టు బెయిల్ ఇచ్చింది. మరో 9 మందికి 14 రోజుల రిమాండు విధించింది. మరో తొమ్మిది మంది మీద పోలీసులు పెట్టిన హత్యానేరం కేసును కోర్టు మార్చింది. తొమ్మిది మందిపైన హత్యానేరం సెక్షన్లకు బదులు తీవ్రగాయాలు అయ్యే సెక్షన్లుగా మార్చమని కోర్టు పోలీసులను ఆదేశించింది.

అరెస్టు చేసిన వారందరినీ పోలీసులు అర్ధరాత్రి తర్వాత 7వ అదనపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇదే విషయమై జనసేన తరపున ఒక ప్రెస్ నోట్ రిలీజైంది. 92 మంది మీద కేసులు పెట్టి 71 మందిని అరెస్టు చేసినట్లు చెప్పింది. 66 మందికి బెయిల్ దొరికితే తొమ్మిది మందిని రిమాండుకు పంపినట్లు ప్రెస్ నోట్లో చెప్పింది. పోలీసులు అరెస్టు చేసిన తమ కార్యకర్తలకు మంత్రులపై జరిగిన దాడితో సంబంధం లేదని మరోసారి చెప్పింది.

మొత్తం మీద పోలీసులు అరెస్టు చేసిన తమ కార్యకర్తల విషయంలో అత్యవసరంగా లాయర్లను మాట్లాడుకుని న్యాయ ప్రక్రియను పార్టీ పూర్తి చేసినట్లు అర్ధమవుతోంది. మరి పోలీసులు ఇంకా కొందరి కోసం వెతుకుతున్నారు. అలాగే ఇపుడు బెయిల్ దొరికిన వాళ్ళను కూడా పోలీసులు మళ్ళీ అరెస్టు చేసే అవకాశముంది. ఇదే కాకుండా హత్యానేరం కాకుండా తీవ్రంగా గాయాలు అయ్యే సెక్షన్ల కింద కేసులు మార్చమన్న కోర్టు ఆదేశాలపై పోలీసులు ఏమి చేస్తారో చూడాలి.

సో అరెస్టయిన వాళ్ళందరి విషయంలో పోలీసులు చాలా గట్టిగానే కేసులు పెట్టినట్లు అర్ధమవుతోంది. మరీ కేసులను ఎదుర్కోవాలంటే జనసేనకు చాలాకాలం పడుతుంది. పవన్ బాగానే ఉంటారు, పోలీసులూ బాగానే ఉంటారు. మధ్యలో నష్టపోయేది మాత్రం కేసులు ఎదుర్కుంటున్న వాళ్ళే అనటంలో సందేహం లేదు. పోలీసుస్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగటంతోనే వాళ్ళ సమయం గడిచిపోతుంది. మరీ కేసుల నుండి వీళ్ళు ఎప్పుడు బయటపడతారో ఏమో.

First Published:  17 Oct 2022 9:07 AM GMT
Next Story