Telugu Global
Andhra Pradesh

మిలటరీ మోడల్ వాహనం- ఎన్నికల ప్రచారానికి రెడీ చేసుకున్న పవన్‌

తన వాహనాన్ని కూడా మిలటరీ వాహనం తరహాలో తయారు చేయించుకున్నారు. రంగు కూడా మిలటరీ వాహనం తరహలోనే ఉంది.

మిలటరీ మోడల్ వాహనం- ఎన్నికల ప్రచారానికి రెడీ చేసుకున్న పవన్‌
X

ఎన్నికల యుద్దానికి సిద్ధమని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 2024లో ఏపీలో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన వాహనం ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ షేర్ చేశారు.


వాహనానికి వారాహి అని పేరు పెట్టినట్టు వెల్లడించారు. పార్టీ విభాగాలకు ఆర్మీ విభాగాల తరహాలో పేర్లు పెట్టుకున్న పవన్ కల్యాణ్.. తన వాహనాన్ని కూడా మిలటరీ వాహనం తరహాలో తయారు చేయించుకున్నారు. రంగు కూడా మిలటరీ వాహనం తరహలోనే ఉంది. ఈ వాహనాన్ని ఇంకా రిజిస్ట్రేషన్ చేయించలేదు. అందుకే నెంబర్ రాలేదు. ఈ తరహా వాహనానికి అనుమతులు వస్తాయా అన్నది వేచి చూడాలి.

Next Story