Telugu Global
Andhra Pradesh

‘జగనన్నా.. మళ్లీ ఆ రోజు మీ వద్దకు వస్తా..’

అన్నా.. అనే పదానికి అర్థం, అమ్మలోని `అ`, నాన్నలోని `న్న` కలిపితే నిజంగా మీరేనన్నా, అమ్మలా గోరుముద్ద పెడుతూ, నాన్నలా బాధ్యతగా ఫీజులు కడుతున్న మీది నిజమైన గొప్ప మనసున్న అన్న

‘జగనన్నా.. మళ్లీ ఆ రోజు మీ వద్దకు వస్తా..’
X

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబర్‌- డిసెంబర్‌ 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లు విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొనడానికి శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కృష్ణా జిల్లా పామర్రు వచ్చారు. విద్యాదీవెన నిధులు విడుదల చేయడానికి ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రి కూర్చున్న సమయంలో విద్యాదీవెన ప‌థ‌కం అందుకుంటున్న ఇద్దరు లబ్ధిదారులు తమ అనుభవాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన విద్యార్ధులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే...

పి. శ్రీ షణ్ముక సాయి ప్రియ, విద్యార్థిని..

అన్నా.. అనే పదానికి అర్థం, అమ్మలోని `అ`, నాన్నలోని `న్న` కలిపితే నిజంగా మీరేనన్నా, అమ్మలా గోరుముద్ద పెడుతూ, నాన్నలా బాధ్యతగా ఫీజులు కడుతున్న మీది నిజమైన గొప్ప మనసున్న అన్న, అన్నా.. మాది మధ్య తరగతి కుటుంబం, నా ఇంటర్‌ తర్వాత నాన్నకు హార్ట్‌ ఆపరేషన్, నా చదువు ఎలా కొనసాగించాలా అనుకునే సమయంలో నాకు కృష్ణా యూనివర్శిటీలో బీటెక్‌ సీట్‌ వచ్చింది, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను చదువుకుంటున్నాను, అమ్మ ఖాతాలో నేరుగా డబ్బు పడుతుంది, నాన్న తను చదువుకునే రోజుల్లో స్కాలర్‌షిప్‌ కోసం ఎన్నో ఆఫీస్‌ల చుట్టూ తిరిగేవారన్నారు, నేను ఒక్క ఆఫీస్‌కు వెళ్ళకుండా వలంటీర్‌ అన్నయ్య మా ఇంటికి వచ్చి నాకు కావాల్సిన సర్టిఫికెట్స్‌ ఇచ్చారు, మీలాంటి విజన్‌ ఉన్న వ్యక్తి సీఎంగా ఉన్నంతవరకు మా విద్యార్థులకు వరం, మీరు మా విద్యార్థులకు అన్నీ ఇస్తున్నారు, మీ వల్ల మాలాంటి ఎంతోమంది చక్కగా చదువుకుంటున్నారు, ప్రతిక్షణం మా గురించి ఆలోచించే మీరు మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మా కుటుంబం కూడా చాలా లబ్ధి పొందింది, మేం మధ్య తరగతి నుంచి ఎగువ మధ్యతరగతికి ఎదిగామంటే మీరే కారణం అన్నా, థ్యాంక్యూ.

దిల్షాద్, విద్యార్థిని

అన్నా.. మాది పేద కుటుంబం, మా నాన్న ప్రేవేట్‌ ఎంప్లాయ్, ఆయన జీతం మీదే మా కుటుంబం గడుస్తుంది, నేను ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్‌ పూర్తి చేశాను, ఇప్పుడు నేను సివిల్‌ ఇంజినీరింగ్‌ మూడో ఏడాది చదువుతున్నాను, పైచదువులు చ‌దవలేను అనుకున్న నేను.. మీ దీవెనలతో కాలేజ్‌లో ఇప్పుడు చదవగలుగుతున్నాను, మీ విద్యా దీవెన, వసతి దీవెనల ద్వారా లబ్ధి పొందాను, నేను మా కరిక్యులమ్‌ కోర్సులతో పాటు ఇతర కోర్‌ సబ్జెక్ట్‌లు కూడా నేర్చుకోవడం వల్ల మంచి గ్రిప్‌ సంపాదించాను, సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌కు నేను ఎలిజబుల్‌ అయ్యాను, నాకు దక్కిన గొప్ప సాయం ఇది, వరల్డ్‌ లో ఉన్న టాప్‌ యూనివర్శిటీలలో నేను ఎంఎస్‌ చేయాలనుకున్నాను, మీరు విదేశీ విద్యాదీవెన తీసుకొచ్చారు, నాడు యోగి వేమన అన్నట్లు మీరు యువతకు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు, మాల్కం గ్లాడ్‌వెల్‌ అనే ఇంగ్లీష్‌ రైటర్‌ టెన్‌ థౌజండ్‌ అవర్స్‌ థియరీ రాశారు, మీరు కూడా టెన్‌థౌజండ్‌ అవర్స్‌ ప్రజల మధ్య గడిపారు కాబట్టి ఇంత గొప్ప నాయకుడయ్యారు, నేను కూడా ఆ థియరీని పాటించి వరల్డ్‌లో గ్రేట్‌ ప్రొఫెషనల్‌ దిల్షాద్‌గా నా పేరు వినిపించిన రోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి స్టేజ్‌ మీద నిలబడి మాట్లాడతానని నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మా యూత్‌కు మార్గదర్శిగా నిలుస్తున్నారు, అన్నా థ్యాంక్యూ.

First Published:  1 March 2024 9:34 AM GMT
Next Story