Telugu Global
Andhra Pradesh

దత్త పుత్రుడిలా ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను అనను –జగన్

ఈ పార్టీ కాకపోతే, మరో పార్టీ అని నేను అనడంలేదు. ఇదే నా రాష్ట్రం ఇక్కడే నా రాజకీయం. దత్తపుత్రుడి లాగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను అనడం లేదు. అని అన్నారు సీఎం జగన్.

దత్త పుత్రుడిలా ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను అనను –జగన్
X

సీఎం జగన్ మరోసారి పవన్ కల్యాణ్ పై సెటైర్లు పేల్చారు. దత్త పుత్రుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతూనే మరోసారి పవన్ కల్యాణ్ వివాహాల ప్రస్తావన తెచ్చారు. ఆయన ఒక భార్య కాకపోతే ఇంకో భార్య అంటారని, కానీ తాను అలా అనడంలేదని, ఏపీలోనే ఉంటాను, ఇక్కడే రాజకీయం చేస్తానన్నారు.

"నేను ఏపీలోనే ఉంటాను. 5 కోట్ల ప్రజలే నా కుటుంబం. ఇక్కడి ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం. రాజకీయ నాయకుడికి విశ్వసనీయత చాలా ముఖ్యం. ఇదే నా రాష్ట్రం, ఇదే నా కుటుంబం. ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ విధానం. చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమని నేను అనను. ఈ పార్టీ కాకపోతే, మరో పార్టీ అని నేను అనడంలేదు. ఇదే నా రాష్ట్రం ఇక్కడే నా రాజకీయం. దత్తపుత్రుడి లాగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను అనడం లేదు." అని అన్నారు సీఎం జగన్.

మూడు రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కమలాపురంలో రూ. 900 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కమలాపురం నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. కమలాపురంలో రూ. 1017 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామన్నారు. బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ని మరోసారి టార్గెట్ చేశారు. ఇటీవల వారిద్దరూ తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి చూపించడంపై సెటైర్లు పేల్చారు.

Next Story