Telugu Global
Andhra Pradesh

ముగ్గురు అధినేతలు సేమ్ టు సేమ్

చెప్పుకోవటానికి చంద్రబాబు నాయుడు తనది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని అంటారే కానీ జనాలను ఆకట్టుకునేట్లుగా మాట్లాడటం చేతకాదు. ఏదో ఊకదంపుడు ఉపాన్యాసాలు ఇస్తారంతే.

ముగ్గురు అధినేతలు సేమ్ టు సేమ్
X

రాష్ట్రంలో మూడు పార్టీల అధినేతల పరిస్ధితి దాదాపు సేమ్ టు సేమ్. విషయం ఏమిటంటే.. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ముగ్గురిలో ఎవరికీ మంచి వాగ్దాటి లేదు. తమ ప్రసంగాలతో జనాలను ఆకట్టుకోగలిగినంత సామర్థ్యం వీళ్ళకు లేదు. చెప్పుకోవటానికి చంద్రబాబు నాయుడు తనది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని అంటారే కానీ జనాలను ఆకట్టుకునేట్లుగా మాట్లాడటం చేతకాదు. ఏదో ఊకదంపుడు ఉపాన్యాసాలు ఇస్తారంతే.

మొదటి నుండి కూడా చంద్రబాబుకు చెప్పిందే చెప్పి జనాలను చావగొట్టడం మాత్రం బాగా తెలుసు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయం తీసుకుంటే సినిమా నేపథ్యం ఉన్నా ఏమాత్రం ఉపయోగం కనబడలేదు. తానేం మాట్లాడుతారో తనకే తెలియదు. ఒక సబ్జెక్టు మొదలుపెట్టి వెంటనే ఇంకో సబ్జెక్టులోకి వెళ్లిపోతారు. ఎప్పుడు ఏమి మాట్లాడుతారో తనకే తెలీదు. మాట్లాడాల్సిన పాయింట్లను కాగితం మీద రాసుకొచ్చి మాట్లాడుతారంతే.

Advertisement

పాయింట్లను కాగితం మీద రాసుకురావటం తప్పుకాదు. కానీ ,కాగితం లేకపోతే అసలు రెండు నిముషాలు కూడా మాట్లాడలేకపోవటమే తప్పు. సంబంధంలేని విషయాలు మాట్లాడుతూ మధ్య మధ్యలో పూనకం వచ్చిన వ్యక్తి ఊగిపోయినట్లు ఊగిపోతు గట్టిగా అరిచేస్తూ ఎవరికీ అర్ధంకాకుండా ఏదేదో మాట్లాడేస్తుంటారు.

ఇక జగన్ విషయం చూస్తే స్పీచ్ పర్వాలేదనే తప్ప బ్రహ్మాండమనేందుకు లేదు. జగన్ కూడా కాగితం చూస్తూనే మాట్లాడుతారు. చివరకు ప్రత్యర్ధులపై ఆరోపణలు, విమర్శలను కూడా కాగితం చూడందే మాట‌లురావు. అందుకనే ముగ్గురి స్పీచులు జనాలను పెద్దగా ఆకట్టుకోవు.

Advertisement

ఇదే సమయంలో కేసీఆర్ వాగ్ధాటి బ్రహ్మాండమనే చెప్పాలి. చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పేస్తారు. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కూడా మంచి వాగ్ధాటుంది. ఇక ఏపీ విషయానికి వస్తే రోజా, పేర్ని నాని, ధర్మాన ప్రసాదరావు, లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ లాంటి కొంతమంది మాత్రమే చక్కగా మాట్లాడగలరు. ఎన్టీఆర్, వైఎస్సార్ వాగ్ధాటిని చూసిన తర్వాత పైన చెప్పుకున్న ముగ్గురు అధినేతల ప్రసంగాలు తేలిపోతాయనటం తప్పుకాదేమో.

Next Story