Telugu Global
Andhra Pradesh

బాలినేని అవుట్.. విజయసాయి ఇన్?

బాలినేని కోరినట్లుగానే డిఎస్పీని మార్చేశారు. అయినా మాజీ మంత్రి అలకపాన్పు దిగలేదు. దాంతో ఇక లాభం లేదనుకుని రాజీనామాను యాక్సెప్ట్ చేసి, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డిని నియమించారట.

బాలినేని అవుట్.. విజయసాయి ఇన్?
X

బాలినేని అవుట్.. విజయసాయి ఇన్?

అవతలి వాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి కొంతవరకే భరిస్తారు. ఒక లిమిట్ దాటి ఓవర్ చేస్తున్నారు అని అనుకుంటే వెంటన కట్ చేసేస్తారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసులరెడ్డి విషయంలో ఇదే జరిగింది. విషయం ఏమిటంటే తనకు జగన్ సమీప బంధువని చెప్పుకునేందుకే బాలినేని రెగ్యులర్‌గా అలకబూనుతున్నారట. బాలినేని ఏదో విషయంలో అలకబూనటం జగన్ పిలపించి బుజ్జగించటం మామూలైపోయింది. మంత్రివర్గంలో నుండి తప్పించారని, తన జిల్లాకే చెందిన సురేష్‌ను మాత్రం కంటిన్యూ చేస్తున్నారని అలిగారు.

అప్పుడు కూడా పార్టీ నేతలకు రెండు రోజులు దూరంగా ఉన్నారు. ఎవరొచ్చినా కలవలేదు. దాంతో జగన్ పిలిపించుకుని బుజ్జగించారు. అయినా తన పట్టువీడకపోవటంతో బాలినేనికి జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. దాంతో దెబ్బకు మాజీ మంత్రి దిగొచ్చారని ప్రచారం జరిగింది. తాజాగా తనను అడగకుండానే ఒంగోలు డీఎస్పీని వేశారని, తన ప్రత్యర్థులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కూడా అలిగారు. డీఎస్పీని వేయటం లేదా తీసేయటం అన్నది చాలా చిన్న విషయం.

అయితే చీటికిమాటికి అలగటం జగన్‌తో కబురు తెప్పించుకోవటం అలవాటైపోయింది. అందుకనే ఈసారి బాలినేని స్థానంలో విజయసాయిరెడ్డిని రీజనల్ కో ఆర్డినేటర్‌గా నియమించేశారట. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు బాలినేని రీజనల్ కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. అయితే అలిగిన నేపథ్యంలో పదవికి రాజీనామా చేశారు. బహుశా తనను పిలిపించుకుని జగన్ బుజ్జగిస్తారని అనుకున్నట్లున్నారు.

బాలినేని కోరినట్లుగానే డిఎస్పీని మార్చేశారు. అయినా మాజీ మంత్రి అలకపాన్పు దిగలేదు. దాంతో ఇక లాభం లేదనుకుని రాజీనామాను యాక్సెప్ట్ చేసి ఆ ప్లేసులో విజయసాయిరెడ్డిని నియమించారట. అంటే అలగటాలు, బుజ్జగింపులతో జగన్ బాగా విసిగిపోయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ తనకు బాగా దగ్గర అని అందరికీ షో చేసుకోవటానికే బాలినేని ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైనా కానీ బాలినేని అలకను పట్టించుకోకూడదని జగన్ అనుకున్నట్లున్నారు. అందుకనే తన నిర్ణయం తీసేసుకున్నారు

First Published:  11 May 2023 5:27 AM GMT
Next Story