Telugu Global
Andhra Pradesh

ట్రైనింగ్ కు రావాల్సిందిగా శ్రీలక్ష్మితో పాటు పలువురికి ఆఖరి అవకాశం

ఆమెతో పాటు 1990 బ్యాచ్‌కు చెందిన అనంతరామ్, 91 బ్యాచ్‌కు చెందిన ఆర్పీ సిసోడియా, సాయిప్రసాద్, అజయ్ జైన్‌,.. 1993 బ్యాచ్‌కు చెందిన ఎంటీ కృష్ణబాబు తదితరులకు కూడా చివరి అవకాశంగా మిడ్ కేరీర్ ట్రైనింగ్ కోసం డీవోపీటీ నుంచి పిలుపు వచ్చింది.

ట్రైనింగ్ కు రావాల్సిందిగా శ్రీలక్ష్మితో పాటు పలువురికి ఆఖరి అవకాశం
X

మిడ్ కేరీర్‌ ట్రైనింగ్‌కు రావాల్సిందిగా శ్రీలక్ష్మితో పాటు ఏపీలోని పలువురు సీనియర్ ఐఏఎస్‌లకు డీవోపీటీ నుంచి పిలుపు వచ్చింది. మిడ్‌ కేరీర్ ట్రైనింగ్‌కు ఇదే ఆఖరి ఆహ్వానం అని కూడా స్పష్టం చేసింది. ఐఏఎస్‌లు తమ కేరీర్‌లో మిడ్‌ ట్రైనింగ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మిడ్ కేరీర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.

ఈ ట్రైనింగ్ కోసం శ్రీలక్ష్మితోపాటు పలువురు ఐఏఎస్‌లకు సమయాన్ని డీవోపీటీ సిద్ధం చేసింది. ఈ ట్రైనింగ్‌కు రావాల్సిందిగా దేశంలో మొత్తం 404 మంది అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం 1994, 95, 96 బ్యాచ్ అధికారులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ బ్యాచ్‌ కంటే ముందు బ్యాచ్‌కు చెందిన వారు కొందరు ఇప్పటికీ మిడ్ కేరీర్‌ ట్రైనింగ్ పూర్తి చేసుకోలేదు. వారికి ఆఖరి అవకాశంగా పిలుపు అందింది. వారిలో శ్రీలక్ష్మీ ఉన్నారు. శ్రీలక్ష్మి 1988 బ్యాచ్ అధికారి.

ఆమెతో పాటు 1990 బ్యాచ్‌కు చెందిన అనంతరామ్, 91 బ్యాచ్‌కు చెందిన ఆర్పీ సిసోడియా, సాయిప్రసాద్, అజయ్ జైన్‌,.. 1993 బ్యాచ్‌కు చెందిన ఎంటీ కృష్ణబాబు తదితరులకు కూడా చివరి అవకాశంగా మిడ్ కేరీర్ ట్రైనింగ్ కోసం డీవోపీటీ నుంచి పిలుపు వచ్చింది. మరి ఈసారి కూడా ఈ అధికారులు ట్రైనింగ్‌కు వెళ్తారో లేదో చూడాలి. వచ్చే ఏడాది ఏప్రిల్10 నుంచి 28వ తేది వరకు ట్రైనింగ్ ఉంటుంది.

First Published:  19 Dec 2022 2:22 AM GMT
Next Story