Telugu Global
Andhra Pradesh

బీజేపీతో పొత్తులేకుంటేనే బాబు, ప‌వ‌న్‌ల‌కు మంచిది

టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తే.. వైసీపీ ఓట్ల శాతం 49 శాతానికి పెరుగుతుందని, తద్వారా 115 నుంచి 122 సీట్లు గెలుచుకుంటుందని తేల్చింది.

బీజేపీతో పొత్తులేకుంటేనే బాబు, ప‌వ‌న్‌ల‌కు మంచిది
X

ఇటీవల విడుద‌లైన‌ సర్వే రిపోర్టు ఒకటి ఆశ్చర్యకరమైన విషయాన్ని తేల్చింది. శాసనసభ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీదే విజయమని ఆ సర్వే తేల్చింది. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు విజయం మరింత సులువు అవుతుందని ఆత్మసాక్షి సర్వే తెలిపింది. బీజేపీ లేకుండా జనసేన, టీడీపీ కూటమి పోటీ చేస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 48 శాతం ఓట్లు వస్తాయని, 106 నుంచి 110 సీట్లను ఆ పార్టీ గెలుచుకుంటుందని ఆ సర్వే తేల్చింది. టీడీపీ, జనసేన కూటమికి 46.5 శాతం ఓట్లు పోలవుతాయని, ఈ కూటమి 64 నుంచి 68 సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది.

టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తే.. వైసీపీ ఓట్ల శాతం 49 శాతానికి పెరుగుతుందని, తద్వారా 115 నుంచి 122 సీట్లు గెలుచుకుంటుందని తేల్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 45 శాతం ఓట్లు వస్తాయని, ఈ కూటమి 60 నుంచి 65 స్థానాలు గెలుచుకుంటుందని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది.

తాజా టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీ 21 నుంచి 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుంది. టీడీపీ, జనసేన కూటమి 3 నుంచి 4 సీట్లలో విజయం సాధిస్తుంది. బీజేపీతో ఈ కూటమి పొత్తు కుదరలేదనే భావనతో తాజాగా జరిగిన సర్వే ఇది. వైసీపీకి 49 శాతం ఓట్లు వస్తాయని సర్వే స్పష్టం చేసింది. టీడీపీ, జనసేన కూటమికి 45 శాతం ఓట్లు పోలవుతాయని చెప్పింది. ఎన్‌డీఏకు 2 శాతం, ఇతరులకు 4 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని చెప్పింది.

First Published:  9 March 2024 9:11 AM GMT
Next Story