Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు ఐటి శాఖ షాక్?

స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు ఎలాగూ అరెస్టయి జైలులోనే ఉన్నారు కాబట్టి ఐటి శాఖ 6వ నోటీసిచ్చి జైలులోనే విచారించేందుకు రెడీ అవుతోందట. ఇందుకు అవసరమైన లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతోందని సమాచారం.

చంద్రబాబుకు ఐటి శాఖ షాక్?
X

చంద్రబాబుకు ఐటి శాఖ షాక్?

చంద్రబాబునాయుడుకు బాగా బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లే ఉంది. ఒకదాని తర్వాత మరో కేసు మెడకు చుట్టుకుంటోంది. స్కిల్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబు గడచిన కొన్ని రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం ఎంత ప్రయత్నిస్తున్నా దొరకటంలేదు. ఒక కేసులో బెయిల్ తెచ్చుకుని బయటపడినా మరో కేసులో అరెస్టు చేసేందుకు సీఐడీ రెడీగా ఉంది. దీంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.

ఈ విషయం ఇలాగుంటే సీఐడీ పెట్టిన కేసులు సరిపోవన్నట్లు ఇన్ కమ్ ట్యాక్స్ శాఖ కూడా నోటీసు ఇవ్వటానికి రెడీ అవుతోందని సమాచారం. రాజధాని నిర్మాణ కాంట్రాక్టుల్లో షాపూర్జీ పల్లోంజి కంపెనీ తరపున సబ్ కాంట్రాక్ట్ కంపెనీ నుంచి చంద్రబాబు రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఐటి శాఖ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. శాఖాపరమైన విచారణకు రావాలని ఐటి శాఖ ఇప్పటికి ఐదు నోటీసులిచ్చినా చంద్రబాబు హాజరుకాలేదు.

ప్రతి నోటీసుకు ఏదో ఒక సాంకేతిక కారణాన్ని సాకుగా చూపించి విచారణను చంద్రబాబు తప్పించుకుంటున్నారు. మామూలుగా ఇంకెవరైనా అయ్యుంటే ఐటి శాఖ తన పద్ధ‌తిలో తాను ప్రొసీడ్ అయిపోయేదే. కానీ చంద్రబాబు లాంటి హై ప్రొఫైల్ వ్యక్తుల విచారణ కాబట్టి ఐటి శాఖ ఉన్నతాధికారులు ఓపికగా ఉన్నారు. 5వ నోటీసుకు కూడా చంద్రబాబు విచారణకు హాజరుకాలేదు. దాంతో తొందరలోనే మరో నోటీసు జారీ చేయాలని డిసైడ్ అయ్యిందట.

స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు ఎలాగూ అరెస్టయి జైలులోనే ఉన్నారు కాబట్టి ఐటి శాఖ 6వ నోటీసిచ్చి జైలులోనే విచారించేందుకు రెడీ అవుతోందట. ఇందుకు అవసరమైన లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతోందని సమాచారం. సబ్ కాంట్రాక్టర్ మనోజ్ వాసుదేవ్‌ని ఐటి శాఖ విచారించినపుడు చంద్రబాబుకు ఇచ్చిన ముడుపుల విషయం బయటపడింది. తన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు రూ.118 కోట్ల ముడుపులను అందుకున్నట్లు మనోజ్ ఐటి శాఖ విచారణలో అంగీకరించారట. పెండ్యాల వాగ్మూలం ఆధారంగా ఐటి శాఖ చంద్రబాబును విచారించాలంటే అందుకు మాజీ సీఎం సహకరించటంలేదు. మరి చివరకు కోర్టు ఏమంటుందో చూడాల్సిందే.

First Published:  28 Oct 2023 5:29 AM GMT
Next Story