Telugu Global
Andhra Pradesh

జగన్ పైకి ఎల్లోమీడియా విశాఖను రెచ్చగొడుతోందా..?

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని డిసైడ్ అయ్యింది 2018లోనే. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబునాయుడే అని ఎల్లోమీడియా ఎక్కడా చెప్పలేదు. వాస్తవానికి విశాఖ ఉక్కు కేంద్రప్రభుత్వ పరిశ్రమ.

జగన్ పైకి ఎల్లోమీడియా విశాఖను రెచ్చగొడుతోందా..?
X

రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తుందనే భయం ఎల్లోమీడియాలో పెరిగిపోతున్నట్లుంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగ సభలు గ్రాండ్ సక్సెస్ అవుతుంటే మరోవైపు చంద్రబాబునాయుడు పాల్గొంటున్న రా..కదలిరా సభలు ఫెయిలవుతున్నాయి. తాజాగా సొంతజిల్లా చిత్తూరులోని గంగాధరనెల్లూరులో జరిగిన రా..కదలిరా సభకు కూడా జ‌లం లేక వెల‌వెల‌బోయింది. ఇద్దరూ పాల్గొంటున్న బహిరంగ సభల తీరును చూసిన తర్వాత ఎల్లోమీడియాలో భయం పెరిగిపోతున్నట్లుంది. మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతారని అర్థ‌మైనట్లుంది. అందుకనే తమవంతుగా విశాఖ జనాలను రెచ్చగొడుతూ బురదచల్లుడు స్టోరీని అచ్చేసింది.

ఇందులో భాగంగానే ఈరోజు ‘విశాఖ ఉక్కుకు.. జగన్ తుప్పు’ అంటూ బ్యానర్ హెడ్డింగ్ పెట్టి తప్పుడు రాతలు రాసింది. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురాలేకపోయిన జగన్ ప్రభుత్వం మరోవైపు విశాఖ ఉక్కును కాపాడుకోలేకపోయిందట. ఉక్కు ఫ్యాక్టరీని తుక్కుగా మార్చేందుకు జగన్ ప్రభుత్వం పూనుకుందట. ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోతోందట. పరిశ్రమకు కేంద్రం ఊపిరి తీసేస్తున్నా జగన్ వ్యతిరేకించటంలేదట. ఆర్థికసాయం చేసే అవకాశమున్నా పట్టించుకోవటంలేదట. గనుల లీజును తెలంగాణ పొడిగించినా.. రాష్ట్ర పరిధిలోని గనుల లీజును మాత్రం జగన్ ప్రభుత్వం పొడిగించలేదని టన్నులు కొద్ది బురదచల్లేసింది. విశాఖ ఉక్కుకు జగన్ ప్రభుత్వం ఉరి బిగించిందని తప్పుడు రాతలన్నీ రాసింది.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని డిసైడ్ అయ్యింది 2018లోనే. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబునాయుడే అని ఎల్లోమీడియా ఎక్కడా చెప్పలేదు. వాస్తవానికి విశాఖ ఉక్కు కేంద్రప్రభుత్వ పరిశ్రమ. దీనిపైన రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి హక్కులు, అధికారాలుండవు. తన పరిశ్రమను కేంద్రం అమ్ముకుంటుంటే రాష్ట్రప్రభుత్వం ఎలా అడ్డుకోగలదు..? ఒకవేళ ఉక్కుపరిశ్రమను ప్రైవేటీకించాలని అనుకుంటే దాన్ని రాష్ట్రప్రభుత్వానికి అప్పగించమని జగన్ ప్రభుత్వం కేంద్రానికి రెండుసార్లు లేఖలు రాసింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండానే లాభాల్లోకి ఎలా తీసుకురావచ్చో కేంద్రానికి రాసిన లేఖలో జగన్ ప్రభుత్వం వివరించింది.

ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటులో వైసీపీ ఎంపీలు గట్టిగా మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. నరేంద్రమోడీని కలిసినప్పుడు కూడా జగన్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించద్దనే చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీకి గతంలో కేటాయించిన గనుల నుండి వస్తున్న రా మెటీరియల్ నాసిరకంగా ఉంది కాబట్టి పొరుగునే ఉన్న ఒడిశాలోని గనులను కేటాయించాలని జగన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖరాసిన విషయం ఎల్లోమీడియాకు తెలీదా..?

దేశంలోని ఏ ఉక్కు ఫ్యాక్టరీకైనా గనులను కేటాయించాల్సింది కేంద్రప్రభుత్వమే అని అందరికీ తెలుసు. అయినా సరే ఎల్లోమీడియా మాత్రం జగన్నే టార్గెట్ చేస్తోంది. కేంద్రంలో చక్రంతిప్పానని తరచూ చెప్పుకునే చంద్రబాబు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి అవసరమైన గనులను ఎందుకు ఎలాట్ చేయించలేకపోయారో ఎల్లోమీడియా సమాధానం చెప్పగలదా..? ఉక్కు ఫ్యాక్టరిపైన జగన్ ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటో ఎల్లోమీడియాకు తెలీదా..? అన్నీ తెలిసే జగన్ ప్రభుత్వంపై విశాఖ జనాలను రెచ్చగొడుతోంది ఎల్లోమీడియా.

First Published:  7 Feb 2024 6:27 AM GMT
Next Story