Telugu Global
Andhra Pradesh

ఎన్నిక‌ల వేళ ఏపీలో మ‌రో బ‌దిలీ.. అసోంకు ప‌రిశీల‌కుడిగా సిట్ చీఫ్ రఘురామిరెడ్డి

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రఘురామిరెడ్డే విధేయుడ‌ని ప్ర‌తిప‌క్షాలు ప‌దే ప‌దే విమ‌ర్శిస్తుంటాయి. ఆయ‌న‌పై ఎల్లో మీడియాలో వ్య‌తిరేక క‌థ‌నాలు వండివారుస్తుంటాయి.

ఎన్నిక‌ల వేళ ఏపీలో మ‌రో బ‌దిలీ.. అసోంకు ప‌రిశీల‌కుడిగా సిట్ చీఫ్ రఘురామిరెడ్డి
X

ఎన్నిక‌ల వేళ ఏపీలో మ‌రో ఉన్న‌తాధికారి బ‌దిలీ అయ్యారు. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి, సిట్ చీఫ్ ర‌ఘురామిరెడ్డిని ఈసీ బ‌దిలీ చేసింది. అసోం పోలీస్ ఎన్నికల పరిశీలకుడిగా ఆయ‌న్ను నియమిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు పంపించింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో కొల్లి రఘురామిరెడ్డి గువాహటి కేంద్రంగా పని చేయనున్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రఘురామిరెడ్డే విధేయుడ‌ని ప్ర‌తిప‌క్షాలు ప‌దే ప‌దే విమ‌ర్శిస్తుంటాయి. ఆయ‌న‌పై ఎల్లో మీడియాలో వ్య‌తిరేక క‌థ‌నాలు వండివారుస్తుంటాయి. ఈ నేపథ్యంలో రఘురామిరెడ్డిని ఎన్నికల సంఘం అసోంకు పంప‌డం హాట్‌టాపిక్‌గా మారింది.

చంద్ర‌బాబు అరెస్టుతో ఫేమ‌స్‌

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును కొల్లి రఘురామిరెడ్డి అరెస్ట్ చేయ‌డం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ‌వ్యాప్తంగా ఆయ‌న ఫేమ‌స్ అయ్యారు. సోమవారం ఉదయం సిట్ కార్యాలయం వద్ద ఓ కీలక కేసులో ప‌త్రాలు త‌గ‌ల‌బెట్టార‌ని, అవి హెరిటేజ్ పత్రాలేనంటూ టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం కొనసాగుతుండ‌గానే రఘురామ్‌రెడ్డిని అసోం ప‌రిశీల‌కుడిగా పంపిస్తూ ఈసీ నిర్ణ‌యం తీసుకుంది.

First Published:  9 April 2024 8:48 AM GMT
Next Story