Telugu Global
Andhra Pradesh

నేను పోటీ చేయలేను.. కాదు నువ్వే చేయాలి- నాని, జగన్ మధ్య సంభాషణ

మీ పిల్లలను రాజకీయంగా ప్రమోట్ చేసుకుంటే చేసుకోండి కానీ.. టికెట్ మాత్రం వారసులకు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ పనితీరు బాగుంటే ఇప్పుడున్న వారికే టికెట్లు ఇస్తామన్నారు.

నేను పోటీ చేయలేను.. కాదు నువ్వే చేయాలి- నాని, జగన్ మధ్య సంభాషణ
X

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లతో సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారసుల అంశాన్ని సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కొందరు గడప గడపకు కార్యక్రమానికి వెళ్లకుండా తమ పిల్లలను పంపుతున్నారని సీఎం అభ్యంతరం తెలిపారు. మీరెందుకు వెళ్లడం లేదంటే.. మా అబ్బాయి తిరుగుతున్నారని కొందరు చెబుతున్నారని.. అలా చేస్తే అంగీకరించబోనని సీఎం చెప్పారు.

మీ పిల్లలను రాజకీయంగా ప్రమోట్ చేసుకుంటే చేసుకోండి కానీ.. టికెట్ మాత్రం వారసులకు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ పనితీరు బాగుంటే ఇప్పుడున్న వారికే టికెట్లు ఇస్తామన్నారు. పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తమ వారసులకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారని సీఎం వివరించారు. తాను మాత్రం ఇప్పుడున్న వారికే టికెట్ ఇస్తానని చెప్పారు.

ఇంతలో పేర్నినాని.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేను.. మా అబ్బాయి చేస్తాడు అని సీఎంకు వివరించే ప్రయత్నం చేశారు. అందుకు స్పందించిన సీఎం జగన్ ''లేదు నువ్వే పోటీ చేయాలి. ఈసారి కూడా నాతో పాటు నువ్వుండాలి.'' అన్నారు. తాను పార్టీ కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తానని.. పోటీ మాత్రం చేయలేనని మరోసారి పేర్నినాని చెప్పగా.. ''అలా కాదు.. ఈసారి నువ్వే పోటీ చేయి'' అని సీఎం జగన్ స్పష్టత ఇచ్చారు.

Next Story