Telugu Global
Andhra Pradesh

తెలుగుదేశానికి ఊపునిచ్చిన స‌ర్వే

ఇండియా టు డే-సీ ఓటర్ సర్వేలో ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే టీడీపీకి 15 ఎంపీ సీట్లు వస్తాయ‌ని తేలిందట. ఇంకేముంది ఎల్లో మీడియా రెచ్చిపోయింది.

తెలుగుదేశానికి ఊపునిచ్చిన స‌ర్వే
X

తెలుగుదేశం పార్టీకి కాదు ఎల్లో మీడియాకు నిజంగా ఊపిరిలూదే వార్తే అనటంలో సందేహం లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే ఇండియా టు డే-సీ ఓటర్ ఓ సర్వే నిర్వహించింది. అదేమిటంటే ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తుంది అని. అందులో టీడీపీకి 15 ఎంపీ సీట్లు వస్తుందని తేలిందట. ఇంకేముంది ఎల్లో మీడియా రెచ్చిపోయింది. టీడీపీకి 15 ఎంపీ సీట్లు అంటే పే...ద్దక్షరాలతో బ్యానర్ కథనం అచ్చేసింది.

15 ఎంపీ సీట్లను టీడీపీ ఒంటరిగానే సాధించేస్తుందట. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో ఏ పార్టీకి ఇన్ని సీట్లు వచ్చే ఛాన్స్ లేదని చెప్పింది. వైసీపీ 3-4 సీట్లకే పరిమితమవుతుందట. మిగిలిన సీట్లలో హోరా హోరీనట. ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కిపాటు మొదలైందట. ఇన్నాళ్ళూ పెయిడ్ సర్వేలతో తప్పుదారి పట్టించిందని విరుచుకుపడింది. 24 సీట్లంటు సొంత, పెయిడ్ సర్వేలతో మోసం చేసిందట. ఎల్లో మీడియాకు తగ్గట్లే చంద్రబాబునాయుడు కూడా రెచ్చిపోయారు. గాలి మళ్ళిందని స్పష్టంగా తేలిపోయిందట. 4 రోజులుపోతే వైసీపీకి ఈ సీట్లు కూడా మిగలవట.

ఇక్కడ విషయం ఏమిటంటే చాలాకాలంగా చాలా సర్వే సంస్థ‌లు వైసీపీ 24 లేదా 25 సీట్లు గెలుచుకుంటుందని తేల్చినప్పుడు ఎల్లో మీడియా పొరబాటున కూడా ఆ వార్తలను రాయలేదు. ఆ సర్వేలపైన విశ్లేషణ కూడా చేయలేదు. సర్వే ఫలితాలు విడుదల చేసినపుడల్లా చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా మొహాలు మాడిపోయేవి. అలాంటిది మొదటిసారి ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే టీడీపీకి మెజారిటి సీట్లు వస్తుందని చెప్పింది. దాంతో ఎల్లో మీడియా ఊపిరి పీల్చుకున్నది. వెంటనే రెచ్చిపోతోంది. ఇప్పుడు ఇండియా టు డే సర్వేనే నిజమన్నట్లు గతంలో వైసీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేలన్నీపెయిడ్ లేదా సొంత సర్వేలని రెచ్చిపోతోంది.

నిజానికి వైసీపీకి అనుకూలంగా సర్వే ఫలితాలు వచ్చినపుడు వైసీపీ నేతలు, టీడీపీకి అనుకూలంగా వచ్చినపుడు టీడీపీ నేతలు రెచ్చిపోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే జనాల మూడ్ ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. ఎన్నికలకు ఇంకా తొమ్మిది మాసాల సమయం ఉంది కాబట్టి ఎప్పుడేమవుతుందో ఎవరు చెప్పలేరు. పైగా టీడీపీకి రాబోతున్న 15 సీట్లు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో ఎవరికీ ఇన్ని వచ్చే ఛాన్స్ లేదని రాయటమే విచిత్రంగా ఉంది. టీడీపీ ఎన్డీయే భాగస్వామ్య పక్షం కాదు. పొత్తు పెట్టుకోవాలని తెగ ఆరాటపడుతున్న జనసేనకు ఒక్కసీటు కూడా రాదని తేలిపోయింది. మరిప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.


First Published:  26 Aug 2023 6:30 AM GMT
Next Story