Telugu Global
Andhra Pradesh

అప్పుడ‌లా.. ఇప్పుడిలా .. మోడీ డబుల్ స్టాండ్‌

ఐదేళ్లు గడిచిపోయింది. సీన్ క‌ట్ చేస్తే.. తీరా చూస్తే ఆనాడు అవినీతి పార్టీ అంటూ ఆరోపణలు చేసిన అదే టీడీపీతో మోడీ జతకట్టారు. ఆ అవినీతి పార్టీకే ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు.

అప్పుడ‌లా.. ఇప్పుడిలా .. మోడీ డబుల్ స్టాండ్‌
X

అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప.. హీరోలు, విలన్లు లేరీ నాటకంలో.. ఇది ఓ సినిమాలో న‌టుడు సాయి కుమార్ చెప్పిన ఫేమస్ డైలాగ్‌. ఇప్పుడు ప్రధాని మోడీ, ఆయన పార్టీ బీజేపీని చూస్తే ఈ డైలాగ్‌ నిజమేననిపిస్తోంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం అంటే 2019 ఎన్నికల్లో ఇదే చంద్రబాబుపై ప్రధాని హోదాలో తీవ్ర విమర్శలు చేశారు మోడీ. అప్పట్లో సన్‌రైజ్‌ స్టేట్ అంటూ చంద్రబాబు ఎత్తుకున్న నినాదంపైనా సెటైర్లు వేశారు మోడీ. సన్‌ రైజ్ అంటే చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ భవిష్యత్ కోసం ఆరాటపడుతున్నాడంటూ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటు దారుడంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ఐదేళ్లు గడిచిపోయింది. సీన్ క‌ట్ చేస్తే.. తీరా చూస్తే ఆనాడు అవినీతి పార్టీ అంటూ ఆరోపణలు చేసిన అదే టీడీపీతో మోడీ జతకట్టారు. ఆ అవినీతి పార్టీకే ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ఆనాడు సన్‌రైజ్‌ అంటూ ఏ లోకేష్‌పైనా సెటైర్లు వేశారో అదే లోకేష్‌ను ఇప్పుడు తన పక్కన కూర్చొబెట్టుకున్నారు. అప్పుడు టీడీపీపై చేసిన విమర్శలనే ఇవాళ వైసీపీపై చేస్తున్నారు మోడీ. అక్కడితో ఆగకుండా చంద్రబాబు హయాంలో ఏపీ ఉత్తమ స్థానంలో ఉందంటూ నాలుక మడతపెట్టేశారు.

ఇక కుటుంబ పార్టీలను, అవినీతి పార్టీలను దగ్గరికి రానీయమంటూ మోడీ, అమిత్ షా ప్రతి సభలోనూ చెప్తుంటారు. కానీ, వాస్తవంలో ఎక్కడా వాటిని పాటించినట్లు కనిపించరు. ఏపీలో టీడీపీ, కర్ణాటకలో జేడీఎస్‌ల విషయంలో ఈ రూల్స్‌ను పక్కనపెట్టేసింది బీజేపీ. ఇప్పుడు ఆ రెండు పార్టీలను కూటమిలో చేర్చుకుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు బీజేపీ, ఆ పార్టీ నేతలు చెప్తున్న మాటలకు విశ్వసనీయత ఎంతో.

First Published:  7 May 2024 5:27 AM GMT
Next Story