Telugu Global
Andhra Pradesh

కోస్తాలో వాన‌లు.. సీమ‌లో ఎండ‌లు

జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్త‌ర కోస్తా వ‌ర‌కు వ్యాపించిన ద్రోణి బ‌ల‌హీన‌ప‌డింది. అయిన‌ప్ప‌టికీ దీని ప్రభావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉత్త‌ర కోస్తా, ద‌క్షిణ కోస్తాల్లో కొన్ని ప్రాంతాల్లో బుధ‌, గురువారాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

కోస్తాలో వాన‌లు.. సీమ‌లో ఎండ‌లు
X

ఈరోజు, రేపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విభిన్న వాతావ‌ర‌ణం క‌నిపించ‌బోతోంది. ఉప‌రిత‌ల ద్రోణి ప్ర‌భావంతో ఉత్త‌ర కోస్తా నుంచి ద‌క్షిణ కోస్తా వ‌ర‌కు ఓ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం చెబుతోంది. మ‌రోవైపు రాయల‌సీమ‌లో ఎండ‌లు మ‌రింత ముద‌ర‌బోతున్నాయ‌ని, ఉష్ణోగ్ర‌తలు పెరుగుతాయ‌ని ప్ర‌క‌టించింది.

ద్రోణి బ‌ల‌హీన‌ప‌డినా వ‌ర్షాలు

జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్త‌ర కోస్తా వ‌ర‌కు వ్యాపించిన ద్రోణి బ‌ల‌హీన‌ప‌డింది. అయిన‌ప్ప‌టికీ దీని ప్రభావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉత్త‌ర కోస్తా, ద‌క్షిణ కోస్తాల్లో కొన్ని ప్రాంతాల్లో బుధ‌, గురువారాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. బుధ‌వారం అల్లూరి సీతారామ‌రాజు, పార్వ‌తీపురం మ‌న్యం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో వాన‌లు ప‌డొచ్చు. పిడుగులు ప‌డే ప్ర‌మాదం ఉన్నందున ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు సెల్‌ఫోన్ మెసేజ్‌లు పంపుతోంది.

రాయ‌ల‌సీమ‌లో పెర‌గ‌నున్న ఉక్క‌పోత‌

మ‌రోవైపు రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల్లోనూ ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతాయ‌ని వాతావ‌ర‌ణ కేంద్రం చెబుతోంది. దీనివ‌ల్ల ఉక్క‌పోత‌, వేడి పెరుగుతాయ‌ని వెల్ల‌డించింది.

First Published:  20 March 2024 6:26 AM GMT
Next Story