Telugu Global
Andhra Pradesh

నా పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా - ముద్రగడ సంచలన ప్రకటన

పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ని తాను ఓడిస్తానని ముద్రగడ సవాల్ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించ లేకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని కూడా శపథం చేశారు.

నా పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా - ముద్రగడ సంచలన ప్రకటన
X

కాపు ఉద్యమ నేత‌, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తాను ఓడించకపోతే తన పేరుని పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరానని.. తాను ఓడిపోయాను కాబట్టి తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఆయన ప్రకటించారు.

కాపు ఉద్యమ నాయకుడైన ముద్రగడ పద్మనాభం ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ని తాను ఓడిస్తానని ముద్రగడ సవాల్ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించ లేకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని కూడా శపథం చేశారు.

అయితే నిన్న ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. తాను విసిరిన సవాల్ ప్రకారం తన పేరును మార్చుకుంటున్నట్లు.. ఇందుకోసం అంతా రెడీ చేసుకున్నట్లు ప్రకటించారు.

'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించి పంపుతాం.. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటా అని చెప్పా. నేను ఓటమి చెందాను. అన్న ప్రకారంగా నా పేరును పద్మనాభ రెడ్డి మార్చుకోవడం కోసం గెజిట్ పబ్లికేషన్ కూడా సిద్ధం చేసుకున్నాను.

పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకుంటాను. దరఖాస్తు ఫారం కూడా నింపా. నేను విసిరిన సవాల్ కి ఓటమి చెందాను కాబట్టి.. ఓటమి చెందితే పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానని చెప్పాను కాబట్టి ఆ మాటకు కట్టుబడి ఉంటాను' అని ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.

First Published:  5 Jun 2024 6:35 AM GMT
Next Story