Telugu Global
Andhra Pradesh

తెలుగుదేశం పార్టీకి పని చేయను.. ప్రశాంత్ కిషోర్‌ సంచలనం

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి మద్దతుగా పని చేశానని.. ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజిస్టుగా పని చేయడం లేదన్నారు ప్రశాంత్ కిషోర్‌. ఇదే విషయాన్ని చంద్రబాబుతో చెప్పానన్నారు.

తెలుగుదేశం పార్టీకి పని చేయను.. ప్రశాంత్ కిషోర్‌ సంచలనం
X

పొలిటికల్ స్ట్రాటజిస్టు ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పని చేయడం లేదని స్పష్టంచేశారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్‌ ఈ విషయంపై కుండబద్దలు కొట్టారు.

విజయవాడలో చంద్రబాబుతో భేటీ వెనుక ఏం జరిగిందనే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ బయటపెట్టారు. చంద్రబాబుతో సమావేశం కోసం ఇద్దరికి కామన్‌ స్నేహితుడైన ఓ నాయకుడు కోరాడని చెప్పారు. అయితే తాను పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా వర్క్ చేయడం లేదని చెప్పినప్పటికీ.. ఒకసారి చంద్రబాబుతో సమావేశమై ఇదే విషయాన్ని చెప్పాలని కోరాడన్నారు. అందుకే తాను విజయవాడ వెళ్లి చంద్రబాబును కలిశానన్నారు ప్రశాంత్ కిషోర్‌.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి మద్దతుగా పని చేశానని.. ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజిస్టుగా పని చేయడం లేదన్నారు ప్రశాంత్ కిషోర్‌. ఇదే విషయాన్ని చంద్రబాబుతో చెప్పానన్నారు. రాబోయే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన పాత్ర ఉండదని స్పష్టం చేశారు. ఎవరికి అనుకూలంగా పని చేయబోనన్నారు.

దాదాపు నెల రోజుల క్రితం పొలిటికల్ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ప్రత్యేక విమానంలో లోకేశ్‌ వెంట విజయవాడ చేరుకున్న ప్రశాంత్ కిషోర్‌ చంద్రబాబుతో దాదాపు గంటకుపైగా చర్చలు జరిపారు. దీంతో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రశాంత్ కిషోర్ పని చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆ ఊహగానాలన్నింటికీ ప్రశాంత్ కిషోర్‌ ఫుల్‌ స్టాప్ పెట్టారు. మరోవైపు ఐ-ప్యాక్ సంస్థ సైతం ప్రశాంత్ కిషోర్ భేటీపైన ప్రకటన చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము వైసీపీ గెలుపు కోసం పని చేస్తామని స్పష్టం చేసింది. ప్రశాంత్‌ కిషోర్‌కు ఐ-ప్యాక్‌కు ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.

First Published:  23 Jan 2024 4:18 AM GMT
Next Story