Telugu Global
Andhra Pradesh

వరల్డ్ ఫేమస్ పిఠాపురం.. హైపర్ ఆది జబర్దస్ కామెడీ

ఏపీలో ఎన్నికలయ్యేవరకు తాము షూటింగ్ లు కూడా క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పారు హైపర్ ఆది. 21మంది అభ్యర్థుల గెలుపుకోసం జనంలోకి వెళ్తున్నామని అన్నారు.

వరల్డ్ ఫేమస్ పిఠాపురం.. హైపర్ ఆది జబర్దస్ కామెడీ
X

జనసేన స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్ ని సీఎం చేయడానికి తామంతా సిద్ధం అంటూ అంబటి రాయుడు ఆల్రడీ ట్విట్టర్లో మంచి కామెడీ పంచారు. తాజాగా జబర్దస్త్ నటుడు హైపర్ ఆది ప్రచారంలో జోకులు పేల్చారు. పవన్ కల్యాణ్ గెలుపుతో పిఠాపురం వరల్డ్ ఫేమస్ అవుతుందని, ప్రపంచంలోని తెలుగువారంతా ఇక్కడికి క్యూ కట్టుకుని వస్తారని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కి జనం ఎలా వస్తున్నారో.. రేపు పిఠాపురం కూడా జనం తండోపతండాలుగా వస్తారని చెప్పారు హైపర్ ఆది.

షూటింగ్ లు కూడా ఆపేశాం..

ఏపీలో ఎన్నికలయ్యేవరకు తాము షూటింగ్ లు కూడా క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పారు హైపర్ ఆది. ప్రస్తుతం జనసేన కోసం తాము షూటింగ్ లు అన్నీ ఆపేసి వచ్చామన్నారు. 21మంది అభ్యర్థుల గెలుపుకోసం జనంలోకి వెళ్తున్నామని చెప్పారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పిఠాపురంలో స్టార్ క్యాంపెయినర్లు విస్తృతంగా పర్యటిస్తారని అన్నారు హైపర్ ఆది.

మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా..?

ప్రస్తుతం స్టార్ క్యాంపెయినర్లుగా సినిమా ఇండస్ట్రీకి చెందినవారిని క్రికెటర్ అంబటి రాయుడిని ప్రకింటించింది జనసేన. అయితే మెగా ఫ్యామిలీ హీరోలు కనీసం పవన్ కల్యాణ్ కోసం అయినా పిఠాపురం వస్తారేమో చూడాలి. ఫ్యామిలీ సెంటిమెంట్, మెగా స్టార్ ఇమేజ్ ని వాడుకోడానికి ఆల్రడీ చిరంజీవిని కలిసి విరాళం చెక్కు తీసుకుని వచ్చారు పవన్. తనకు పరోక్షంగా అన్నయ్య సపోర్ట్ ఉందని చెప్పుకుంటున్నారు. మరి పిఠాపురం ప్రచారంలో కూడా మెగా సందడి కనిపిస్తుందేమో చూడాలి.

First Published:  11 April 2024 12:57 PM GMT
Next Story