Telugu Global
Andhra Pradesh

లోకేష్‌కు అర్థ‌మవుతోందా?

పార్టీ వర్గాల సమాచారం ఏమిటంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాడట. బీజేపీ ముఖ్యులేమో లోకేష్‌ను కలవటానికి ఏమాత్రం ఇష్టపడటంలేదు. దాంతో ఇన్నిరోజుల నుండి లోకేష్‌కు నిరీక్షణే తప్ప కటాక్షం లభించలేదు

లోకేష్‌కు అర్థ‌మవుతోందా?
X

నారా లోకేష్‌కు ఈ విషయం అర్థ‌మవుతున్నదో లేదో. ఎంతకాలం ఢిల్లీలో కూర్చున్నా ఎలాంటి ఉపయోగం ఉండదని అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన 12 రోజులుగా లోకేష్ ఢిల్లీలోనే కూర్చున్నారు. అక్కడ ఏం చేస్తున్నారో అర్థంకావటంలేదు. ఎల్లోమీడియా అయితే చంద్రబాబుకు బెయిల్ విషయం మీద సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడుతున్నారని కవరింగ్ ఇస్తోంది. సిద్దార్థ లూథ్రా లాంటి ఖరీదైన పెద్ద లయర్లు విజయవాడలో ఉంటే లోకేష్ ఢిల్లీలో ఎవరితో మాట్లాడతాడు.

పార్టీ వర్గాల సమాచారం ఏమిటంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాడట. బీజేపీ ముఖ్యులేమో లోకేష్‌ను కలవటానికి ఏమాత్రం ఇష్టపడటంలేదు. దాంతో ఇన్నిరోజుల నుండి లోకేష్‌కు నిరీక్షణే తప్ప కటాక్షం లభించలేదు. ఇక్కడ లోకేష్ మరచిపోయింది ఏమిటంటే చంద్రబాబును కలవటానికే అమిత్ షా ఇష్టపడలేదు. చంద్రబాబుకే దక్కని అమిత్ షా కటాక్షం ఇక లోకేష్‌కు ఎలా దక్కుతుంది.

పైగా చంద్రబాబుకు మద్దతుగా ఢిల్లీలో చక్రం తిప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. ఆదుకునే వాళ్ళున్నపుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 12 రోజుల అతికష్టం మీద లోకేష్ కలవగలిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మాత్రమే. స్కిల్ స్కామ్‌లో ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబును రాష్ట్రపతి మాత్రం ఏం చేయగలరు? పైగా చంద్రబాబుకు రిమాండు విధించిన, క్వాష్ పిటీష‌న్‌ను డిస్మిస్ చేసిన ఏసీబీ, హైకోర్టు జడ్జీలపై దారుణంగా కామెంట్ చేస్తు, ట్రోల్ చేస్తున్నవాళ్ళపై సివియర్ యాక్షన్ తీసుకోవాలని రాష్ట్రపతే ఏపీ చీఫ్ సెక్రటరీని ఆదేశించారు.

సో, జరుగుతున్నది చూస్తుంటే ఎంతకాలం లోకేష్ వెయిట్ చేసినా అమిత్ షా అపాయిట్మెంట్ దొరకటం కష్టమనే అర్థ‌మవుతోంది. అప్పటికీ బీజేపీలోని చంద్రబాబు మనుషులు శతవిధాల ప్రయత్నిస్తున్నా ఉపయోగం కనబడటంలేదు. ‘కాలం కలిసిరానప్పుడు అధికులమని అనరాదు’ అనే సామెతను చంద్రబాబు, లోకేష్ మరచిపోయినట్లున్నారు. అందుకనే జగన్ పుట్టుకే తప్పుడు పుట్టుకని, ఏం పీకుతావు, ఏం పీక్కుంటావో పీక్కో అని నోటికొచ్చినట్లు మాట్లాడారు. గట్టిగా ఒక్కటి పీకితే తండ్రేమో సెంట్రల్ జైల్లో, కొడుకేమో ఢిల్లీలో కూర్చున్నారు.

First Published:  27 Sep 2023 6:19 AM GMT
Next Story