Telugu Global
Andhra Pradesh

పోలవరంలో చంద్రబాబు మెక్కింది ఎంత..?

పోలవరం ప్రాజెక్టును రాష్ట్రమే నిర్మిస్తుందని చంద్రబాబు చెప్పడం వెనక కేవలం అత్యుత్సాహం మాత్రమే లేదని, అంతకు మించిన ఆంతర్యం ఉందని వాస్తవాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.

పోలవరంలో చంద్రబాబు మెక్కింది ఎంత..?
X

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. విభ‌జ‌న చట్టంలో ఆ విషయాన్ని స్పష్టంగా చేర్చింది. దానివల్ల పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించి, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే, చంద్రబాబు అత్యుత్సాహం ప్రదర్శించి రాష్ట్రమే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తుందని, కావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వాలని చెప్పారు. అందుకు కేంద్రం చాలా సంతోషంగా అంగీకరించింది.

పోలవరం ప్రాజెక్టును రాష్ట్రమే నిర్మిస్తుందని చంద్రబాబు చెప్పడం వెనక కేవలం అత్యుత్సాహం మాత్రమే లేదని, అంతకు మించిన ఆంతర్యం ఉందని వాస్తవాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. అంతేకాదు, రాష్ట్ర ప్రయోజనాల మీద ఆయనకు దృష్టిలేదని, కేవలం స్వార్థం కోసమే దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని వాస్తవాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆ ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతిని చూస్తే కూడా మనకు అవగతం అవుతుంది. పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని చంద్రబాబు ప్రభుత్వం రూ.16 వేల కోట్ల నుంచి రూ.57,940.86 కోట్లకు పెంచింది తద్వారా రూ. 25 వేల కోట్లను చంద్రబాబు మెక్కేశారు. పోలవరం నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది.

చంద్రబాబు బినామీ అనగానే గుర్తొచ్చేది పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్‌. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉండి చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు. సీఎం రమేష్‌ పేరుతో చంద్రబాబు జలవనరుల శాఖలో రూ.4,834 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ప్రాజెక్టులన్నీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌కు కట్టబెట్టారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘించారని, నాణ్యతకు తిలోదకాలిచ్చారని ఆరోపణలున్నాయి. చంద్రబాబు అవినీతికి ఆయన ఐదేళ్ల పాలనలో అంతులేకుండా పోయిందని చెప్పడానికి ఇది ఉదాహరణ మాత్రమే.

First Published:  30 Jan 2024 6:49 AM GMT
Next Story