తిరుపతి జిల్లా వడమాల పేట మండలంలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని హోం మంత్రి అనిత పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అంతకుముందు చిన్నారి ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటుందని, చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓ కామాంధుడు మూడున్నరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, హతమార్చి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. తిరుపతి జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది.
Previous Articleసిరీస్ ఓటమికి పూర్తి బాధ్యత కెప్టెన్‌గా నాదే
Next Article శ్రీనగర్ మార్కెట్‌లో గ్రెనేడ్ పేలుడు కలకలం
Keep Reading
Add A Comment