Telugu Global
Andhra Pradesh

ఆ తొల‌గింపు చెల్ల‌దంటూ హైకోర్టు తీర్పు

అధికారుల విచార‌ణ‌లో ఉడత సుజాత సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారని, ఎలాంటి అక్రమాలకు పాల్పడటం లేదని 90 శాతం మంది చిన్నారుల తల్లిదండ్రులు అధికారులకు తేల్చిచెప్పారు.

ఆ తొల‌గింపు చెల్ల‌దంటూ హైకోర్టు తీర్పు
X

ఏపీ మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్‌రెడ్డి సిఫార‌సుపై అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌ తొల‌గింపు చెల్ల‌దంటూ హైకోర్టు తీర్పు వెలువ‌రించింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ నల్లపాళెం అంగన్ వాడీ టీచర్ ఉడత సుజాతపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా అధికారులకు మంత్రి కాకాణి లేఖ రాశారు. అధికారుల విచార‌ణ‌లో ఉడత సుజాత సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారని, ఎలాంటి అక్రమాలకు పాల్పడటం లేదని 90 శాతం మంది చిన్నారుల తల్లిదండ్రులు అధికారులకు తేల్చిచెప్పారు.

సుజాతపై వచ్చిన ఫిర్యాదులు ఉద్దేశపూర్వకమైనవని తేలినప్పటికీ, మంత్రి ఆదేశాలు ధిక్క‌రించలేక‌ ఆమెను విధుల నుంచి తొలగించారు అధికారులు. త‌న‌ను అకార‌ణంగా తొల‌గించ‌డంపై అంగ‌న్‌వాడీ టీచ‌ర్ సుజాత‌ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం సుజాతకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆమెపై ఏమైనా ఫిర్యాదులుంటే మళ్లీ విచారణ జరిపి హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. హైకోర్టు ఉత్తర్వులతో అంగన్ వాడీ టీచర్ ఉడతా సుజాత తిరిగి విధుల్లో చేరనుంది.

First Published:  2 Sep 2022 6:03 AM GMT
Next Story