Telugu Global
Andhra Pradesh

సెక్యూరిటీ సిబ్బంది ఎంపిక ప‌య్యావుల కేశ‌వ్ ఇష్టం

త‌న భ‌ద్ర‌త కుదించార‌ని, త‌న‌కు ప్రాణ‌హాని ఉన్న నేప‌థ్యంలో అద‌న‌పు భ‌ద్ర‌త కావాల‌ని ప‌య్యావుల కేశ‌వ్ హైకోర్టుని ఆశ్ర‌యించారు.

సెక్యూరిటీ సిబ్బంది ఎంపిక ప‌య్యావుల కేశ‌వ్ ఇష్టం
X

పీఏసీ చైర్మ‌న్‌, ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్ ఎంపిక చేసుకున్న‌వారినే సెక్యూరిటీ సిబ్బందిగా నియ‌మించాల‌ని కోర్టు ఆదేశించింది. దీనిపై ప్ర‌భుత్వ న్యాయ‌వాది అభ్యంత‌రం తెల‌ప‌గా, పిటిష‌న‌ర్‌కి న‌మ్మ‌కం క‌ల‌గాలి క‌దా అని కోర్టు వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‍కు సెక్యూరిటీ తొలగింపుపై బుధ‌వారం హైకోర్టులో విచారణ జ‌రిగింది. పీఏసీ చైర్మ‌న్ అయిన ప‌య్యావుల‌ కేశవ్‍కు భద్రత కల్పించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఐదు లేదా ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది పేర్లు ఇవ్వాలని పిటిషనర్‍కు సూచించింది. వీరిలో ఇద్దరిని సెక్యూరిటీగా నియమించేందుకు తగిన ఆదేశాలిస్తామన్న హైకోర్టు పేర్కొంది.

త‌న భ‌ద్ర‌త కుదించార‌ని, త‌న‌కు ప్రాణ‌హాని ఉన్న నేప‌థ్యంలో అద‌న‌పు భ‌ద్ర‌త కావాల‌ని ప‌య్యావుల కేశ‌వ్ హైకోర్టుని ఆశ్ర‌యించారు. గ‌తంలో ఈ కేసు విచారణ సందర్బంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయ‌స్థానం ఆదేశించింది. నేటి వరకూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడం పట్ల పిటీషనర్ త‌ర‌పు న్యాయ‌వాది అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది పేర్లు పిటీషనరే ఇవ్వాలని హైకోర్టు సూచించడం పట్ల ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పిటిషనర్ కు నమ్మకం ఉండాలి కదా అని హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది. తొలుత వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించాలని సూచించిన న్యాయ‌స్థానం, విచారణ అనంతరం టూ ప్లస్ టూ సెక్యూరిటీ కల్పించడం పై తగిన ఆదేశాలు ఇస్తామని పేర్కొంది.

First Published:  22 Feb 2023 11:14 AM GMT
Next Story