Telugu Global
Andhra Pradesh

ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. టపాసులు కాల్చడంతో తగలబడ్డ థియేటర్

ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఆయన హీరోగా నటించిన బిల్లా సినిమాను ప్రదర్శించారు. తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్లో ఉదయం 8 గంటలకు షో ప్రారంభం అయ్యింది.

ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. టపాసులు కాల్చడంతో తగలబడ్డ థియేటర్
X

తమ అభిమాన హీరోలు నటించే సినిమాలు విడుదలవుతున్న సమయంలో అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఆ హంగామాకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఇటీవల అభిమానుల అత్యుత్సాహం, విచిత్ర చేష్టల కారణంగా థియేటర్లు కూడా తగలబడి పోతున్నాయి. దీంతో కొత్త సినిమాలను ప్రదర్శించడానికి కూడా థియేటర్ల ఓనర్లు భయపడిపోతున్నారు.

ఇటీవల తమిళనాడులో కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా విడుదల కాగా.. అందులో విలన్ రోల్ పోషించిన సూర్య ఎంట్రీ సీన్ రాగానే ఆయన ఫ్యాన్స్ థియేటర్లోనే బాణసంచా కాల్చారు. దీంతో ఆ థియేటర్ తగలబడిపోయింది. అలాగే చిరంజీవి, సల్మాన్ ఖాన్ హీరోలుగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల విడుదల కాగా మహారాష్ట్రలోని ఒక థియేటర్లో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ బాణాసంచా కాల్చడంతో అది కాలిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్ తగలబడింది.

ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఆయన హీరోగా నటించిన బిల్లా సినిమాను ప్రదర్శించారు. తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్లో ఉదయం 8 గంటలకు షో ప్రారంభం అయ్యింది. సినిమా స‌మ‌యంలో అభిమానులు థియేటర్లోని సీట్ల మీద టపాసులు పెట్టి కాల్చారు. దీంతో సీట్లు కాలిపోయి థియేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సినిమా చూసేందుకు వచ్చిన వారు భయంతో బయటికి పరుగులు తీశారు. అయితే ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

First Published:  23 Oct 2022 7:17 AM GMT
Next Story