Telugu Global
Andhra Pradesh

ఎల్లోమీడియా కోరిక బయటపడిందా..?

జగతి పబ్లికేషన్స్ కేసు 381వ సారి వాయిదాపడిందట. 2012లో పక్కా ఆధారాలతోనే సీబీఐ అభియోగపత్రాన్ని దాఖలుచేసిందట. నామమాత్రపు పెట్టుబడితోనే సాక్షి పత్రిక జగన్ సొంతమైందని నానా రచ్చచేసింది.

ఎల్లోమీడియా కోరిక బయటపడిందా..?
X

ఎల్లోమీడియాకు చాలాకాలంగా ఒక కోరిక ఉంది. అదేమిటంటే.. అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డికి జైలుశిక్ష పడాలని. అయితే ఆ కోరిక కలగానే మిగిలిపోతోంది. రాబోయే ఎన్నికల్లోపు కోర్టులో కేసుల విచారణ ఒక కొలిక్కి వచ్చి 2 సంవత్సరాలకన్నా ఎక్కువ శిక్షపడాలని బలంగా కోరుకుంటున్నట్లుంది. ఎందుకంటే.. పదవిలో ఉన్న వ్యక్తులకు రెండేళ్ళు, అంతకుమించి జైలు శిక్షపడితే అనర్హత వేటుపడుతుందట. అంతేకాదు శిక్షాకాలం పూర్తయిన తర్వాత 6 ఏళ్ళు ఎన్నికల్లో పాల్గొనేందుకు అనర్హులని తేల్చింది.

అక్రమార్జన కేసులు గనుక నిరూపణ అయితే జగన్ కు గరిష్టంగా 7 ఏళ్ళు శిక్షపడాలని కోరుకుంటోంది. అంటే 7 ఏళ్ళు జైలుశిక్ష+6 ఏళ్ళు అనర్హత వేటు మొత్తం కలిపి 13 ఏళ్ళు పదవులకు జగన్ దూరంగా ఉండాలని చాలా బలంగా కోరుకుంటోంది. ‘వాయిదాల వీరుడు.. అవినీతి ధీరుడు’ అనే బ్యానర్ హెడ్డింగ్ తో చాలా పెద్ద స్టోరీ అచ్చేసింది. సీబీఐ కేసుల్లో వాయిదాలే జగన్ ఊపిరట. జగతి పబ్లికేషన్స్ కేసు 381వ సారి వాయిదాపడిందట. 2012లో పక్కా ఆధారాలతోనే సీబీఐ అభియోగపత్రాన్ని దాఖలుచేసిందట. నామమాత్రపు పెట్టుబడితోనే సాక్షి పత్రిక జగన్ సొంతమైందని నానా రచ్చచేసింది.

సీబీఐ కేసులు 381 సార్లు, ఈడీ కేసు 251 సార్లు వాయిదాలు పడిందంటే జగన్ ఘనత ఏమిటో అర్థం చేసుకోవచ్చట. ఇక్కడ చూడాల్సింది జగన్ ఘనతను కాదు దర్యాప్తు సంస్థ‌ల చేతకానితనాన్ని. సాక్షిలో జగన్ కనీసం నామమాత్రపు పెట్టుబడైనా పెట్టారు. మార్గదర్శిలో అసలు రామోజీరావు ఒక్కరూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. హిందూ అవిభాజ్య కుటుంబంగా మొదలుపెట్టిన మార్గదర్శి చిట్ కంపెనీలో బయట వ్యక్తుల నుండి రూపాయి పెట్టుబడి కూడా తీసుకోకూడదట. అయినా రామోజీ బయటనుండే పెట్టుబడులు తెచ్చి వ్యాపారం మొదలుపెట్టారట.

రామోజీ వ్యాపారం అక్రమమని కోర్టుల్లో దాదాపు రుజువైందని ఉండవల్లి చాలాసార్లు చెప్పారు. అయినా సరే కేసును ఫైనల్ కానీయకుండా వాయిదాల మీద వాయిదాలు పడేట్లుగా రామోజీ చేయటంలేదా..? తన మోసాలు బయపడితే ఎన్ని సంవత్సరాలు జైలుశిక్ష పడుతుందో అన్న భయంతోనే జగన్ పైన కథనం ఇచ్చినట్లుంది. లేకపోతే తమను మోసంచేసినట్లు ఒక్క పారిశ్రామికవేత్త కూడా జగన్ పైన ఆరోపణలు చేయలేదు. కానీ, మార్గదర్శి మోసంచేసిందని చాలామంది చందాదారులు ఇప్పటికే ఫిర్యాదు చేసున్న విషయం అందరికీ తెలిసిందే.

First Published:  8 Jan 2024 5:39 AM GMT
Next Story